Begin typing your search above and press return to search.

బాహుబలి-దంగల్ కంటే పద్మావత్ టాప్

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:15 AM GMT
బాహుబలి-దంగల్ కంటే పద్మావత్ టాప్
X
వివాదాలతో మొదలై వివాదాల నడుమ రిలీజ్ అయిన పద్మావత్ సినిమా మిక్సిడ్ టాక్ తో దూసుకెళుతోంది. సౌత్ లో అంతగా ఆదరణ అందుకోకపోతున్నా నార్త్ లో మాత్రం సినిమా మంచి వసూళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. పద్మావత్ UK వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ అమెరికా లలో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. అక్కడ ఎలాంటి వివాదాలకు జరగకుండా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో డాలర్ల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని బాహుబలి 2- దంగల్ రికార్డులను పద్మావత్ బ్రేక్ చేసింది. పద్మావత్ $ 367లను రాబట్టగా.. బాహుబలి 2 - $ 212k మరియు డాంగల్ $ 247k కలెక్షన్స్ ని అందుకున్నాయి. దీంతో పద్మావత్ మొదటి స్థానంలో నిలిచింది.

సంజయ్ లీల భన్సాలీ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. గత చిత్రాలు కూడా ఈ దర్శకుడికి మంచి లాభాలను అందించాయి. అలాగే రన్ వీర్ - దీపిక యాక్టింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ఎమోషన్స్ కూడా రియాలిటీగా ఉండడంతో అభిమానులకు తెగ నచ్చేసింది. ఫైనల్ గా సినిమా బాహుబలి - దంగల్ రికార్డులను డాలర్స్ తో వెనక్కి నెట్టి ఓ రికార్డు అయితే అందుకుంది. మరి ఇండియాలో ఏ స్థాయిలో అందుకుంటుందో ఈ వీక్ గడిస్తే గాని తెలియదు.