Begin typing your search above and press return to search.

పద్మావతి కి దారిచ్చిన ప్యాడ్ మాన్

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:06 PM IST
పద్మావతి కి దారిచ్చిన ప్యాడ్ మాన్
X
అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారైంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మొన్న సంక్రాంతి కి వరుసగా విడుదలైన మన సినిమాలతో థియేటర్లు కలకళలాడగా - ఇపుడు ఒక్క కొత్త సినిమా కూడా లేక వెలవెలబోతున్నాయి. కానీ మళ్ళీ పోయిన కాంతిని తెబోతోంది రానున్న గణతంత్ర దినోత్సవం.

అవునండీ. ఒకటి కాదు రెండు కాదు. ఆరు సినిమాలు జనవరి 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో అనుష్క నటించిన బాగమతి ఒకటి కాగా - మంచు విష్ణు చేసిన ఆచారి అమెరికా యాత్ర మరొకటి. హౌరా బ్రిడ్జ్ అనే ఒక చిన్న సినిమా కూడా అదే రోజున తెరపైకి రానుంది. ఈ మూడు తెలుగు సినిమాలు కాగా - ముచ్చటగా మూడు డబ్బింగ్ సినిమాలు కూడా బరిలోకి దిగానున్నాయాండోయ్. దీపికా పదుకొనె టైటిల్ రోల్ లో నటించిన పద్మావతి (పద్మావత్) 25న విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉండగా - తమిళ హీరో విక్రమ్ తమన్నా తో జంటగా నటించిన స్కెచ్ సినిమా మరియు విశాల్ అభిమాన్యుడు జనవారి 26న మన ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉండగా అక్షయ కుమార్ నటించిన ప్యాడ్ మాన్ కూడా జనవరి 26నే రిలీజ్ అవ్వాలి.

కానీ పద్మావతి దర్శకుడు సంజయ్ లీల భన్సాలి అక్షయ కుమార్ ను తమ సినిమా అవ్వకవ్వక జనవరి 25న విడుదల అవ్వబోతోందని దయచేసి ప్యాడ్ మాన్ రిలీజ్ ను వాయిదా వేయమని కోరగా అక్షయ్ కుమార్ కరిగిపోయి తన సినిమాను ఫిబ్రవరి 9 కు వాయిదా వేసాడని టాక్.