Begin typing your search above and press return to search.

మన బాలుకు దేశ రెండవ అత్యున్నత పురష్కారం

By:  Tupaki Desk   |   10 Nov 2021 5:38 AM GMT
మన బాలుకు దేశ రెండవ అత్యున్నత పురష్కారం
X
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందిన తర్వాత దేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషన్‌ ను దక్కించుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ చేతుల మీదుగా ఆయన తరపును ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఆ అవార్డును అందుకున్నారు. మరోసారి బాలు గారు జనాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఆయన మృతి చెందినా కూడా ఎప్పుడు ఆయన పాటలు వింటూనే ఉన్నా అభిమానులు ఆయన మృతి వార్తను మర్చి పోయారు. తాజాగా పద్మ విభూషన్‌ అవార్డు ను కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన మృతి మళ్లీ జనాలను కలచి వేసింది. ఈ సమయంలో ఆయన ఉండి ఉంటే ఎంతో బాగుండేది అంటూ పలువురు అభిమానులు ఎమోషనల్‌ అవుతున్నారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురష్కారంను దక్కించుకున్న సింగర్‌ గా బాలసుబ్రమణ్యం గారికి అరుదైన ఘనత దక్కేది. భారతరత్న అర్హులు అయిన బాలు గారికి పద్మ విభూషన్ దక్కడం సంతోషంగా ఉందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎస్పీ బాలసుబ్రమమణ్యం మృతి లోటు మళ్లీ తెలిసిందని అభిమానులు ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించిన చర్చ మళ్లీ జరుగుతూ ఉంది. 2001 సంవత్సరంలో మొదటి పద్మ అవార్డును అందుకున్న బాలు గారు 2011 లో పద్మ భూషన్ అవార్డును దక్కించుకున్నారు. 2021 లో పద్మ విభూషన్ ను మృతి చెందిన తర్వాత పొందారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కొడుకు చరణ్ కు పద్మ విభూషన్ ను అందించడం జరిగింది. బాలు కుటుంబ సభ్యులతో పాటు కొందరు ముఖ్యులు ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ఒక అద్బుతమైన సింగర్ గా నిలిచిన ఆయన కెరీర్‌ లో ఎన్నో రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అత్యున్నత పురష్కారాలు.. అవార్డులు.. రివార్డులను దక్కించుకున్నారు. బాలు గారు కరోనాతో చనిపోయి సంవత్సరం దాటినా కూడా ఇంకా అభిమానులు ఆయన మరణంను జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన బతికి ఉంటే మరో పది వేల పాటలు పాడి 50 వేల పాటల మైలు రాయిని చేరుకునే వారు అంటూ అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కరోనా వల్ల ఇండియా కోల్పోయిన అతి పెద్ద సెలబ్రెటీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అనడంలో సందేహం లేదు.