Begin typing your search above and press return to search.

కూల్ వెదర్ లో మిస్టర్ కూల్

By:  Tupaki Desk   |   6 March 2018 4:12 AM GMT
కూల్ వెదర్ లో మిస్టర్ కూల్
X
యూత్ హీరోల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు శర్వానంద్. ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా చేస్తూ వచ్చిన వైవిధ్యమైన పాత్రలు అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. రన్ రాజా రన్ లాంటి కామెడీ ఎంటర్ టెయినర్ లో ఎంతగా మెప్పించాడో మళ్లీమళ్లీ ఇది రాని రాజులాంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్రను అంతకంటే బాగా చేసి శభాష్ అనిపించుకున్నాడు.

లేటెస్ట్ గా మహానుభావుడు సినిమా తరవాత మరో ఎమోషనల్ స్టోరీ చేసేందుకు శర్వానంద్ ఓకే చెప్పాడు. కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేం హను రాఘవపూడి డైరెక్షన్ లో పడిపడి లేచే మనసు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రివీల్ చేశారు. ఓ హిల్ స్టేషన్ లో ఓ ఉదయం వేళ మంచుకురుస్తుండగా కప్పులో టీ తాగుతున్న శర్వా లుక్ సింప్లీ సూపర్బనే చెప్పాలి. ఈ స్టిల్ లో హ్యాండ్సమ్ గా ఉండటంతో కాస్త రఫ్ గడ్డంతో కొంచెం కొత్తగా కూడా కనిపించాడు.

అందాల రాక్షసి.. కృష్ణగాడి వీరప్రేమగాథలతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఎంత బాగా తీయగలడో హను రాఘవపూడి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే పొయిటిక్ గా ఉండేలా పడిపడి లేచే మనసు టైటిల్ తో మరో ఫీల్ గుడ్ సినిమా తీయబోతున్నానని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి ఒక రోల్ చేస్తోంది. ఇంకో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.