Begin typing your search above and press return to search.

ఎన్ ఆర్ ఐల ఓటు ఎవరికి?

By:  Tupaki Desk   |   20 Dec 2018 5:33 AM GMT
ఎన్ ఆర్ ఐల ఓటు ఎవరికి?
X
రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మహా రంజుగా ఉండబోతోంది. ఏకంగా నాలుగు తెలుగు క్రేజీ సినిమాలతో ఒక బాలీవుడ్ స్టార్ హీరో మూవీ రేస్ లో ఉండటంతో అన్ని చూసే అలవాటు ఉన్న సినిమా ప్రేమికులు దేనికి ముందు వెళ్ళాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఇక్కడే కాదు ఓపెనింగ్స్ కు చాలా కీలకంగా మారిన ఓవర్సీస్ లో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా పోటీలో ఉండటంతో ఎన్ ఆర్ ఐలు వేటికి మొగ్గు చూపుతారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.

రేపు ఆక్వామెన్-బంబుల్ బీ-మ్యారీ పాపిన్స్ రిటర్న్స్ అక్కడ రేస్ లో ఉన్నాయి. వీటి ప్రభావం మనవాటి మీద ఉంటుందేమో అన్న టెన్షన్ కొందరిలో లేకపోలేదు. కాని ప్రాక్టికల్ గా చూసుకుంటే ఎన్ ఆర్ ఐలు అందులో ఆంధ్రులు రేపు మొదటి ఓటు తెలుగు సినిమాకే వేస్తారునడంలో సందేహం అక్కర్లేదు. కారణం చాలా సింపుల్. హాలీవుడ్ సినిమాలు ఎన్ని ఉన్నా తెలుగు సినిమా మొదటి రోజు చూస్తే వచ్చే మజానే వేరు. పైగా వస్తున్నవి ఆషామాషీ చిన్న సినిమాలు కాదు. దేనికవే చాలా ప్రత్యేకత ఉన్నవి. ఫిదాతో అక్కడి రికార్డులు బద్దలు కొట్టడంలో కీలకంగా నిలిచిన సాయిపల్లవి శతమానం భవతి లాంటి మూవీతో అక్కడి మనసులను గెలుచుకున్న శర్వానంద్ కాంబోలో లవ్ స్టొరీ కాబట్టి పడి పడి లేచే మనసు కాస్త ముందంజలో ఉంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంతరిక్షం తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ కావడంతో సహజంగానే ఇలాంటి మూవీని మనవాళ్ళు ఎలా డీల్ చేసుంటారన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక కేజిఎఫ్ ప్రమోషన్ వైఫల్యం వల్ల బజ్ కోల్పోయింది. మారి 2ని ధనుష్ కున్న తక్కువ మార్కెట్ వల్ల తెలుగు వాళ్ళు ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకునే అవకాశం లేదు. ఇక షారుఖ్ ఖాన్ జీరో అన్ని వర్గాలు కోరుకునేది కాదు. సో ఎలా చూసుకున్నా తెలుగు సినిమాలే కాస్త ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటాయి కాబట్టి రేపు పెద్దగా టెన్షన్ అక్కర్లేదనే చెప్పొచ్చు