Begin typing your search above and press return to search.

సోనూసూద్ కోసం 720 కి.మీ పాద యాత్ర

By:  Tupaki Desk   |   8 Jun 2021 3:04 PM IST
సోనూసూద్ కోసం 720 కి.మీ పాద యాత్ర
X
గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్‌ పేరు మారు మ్రోగి పోతుంది. ఆయన దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా కూడా వెంటనే స్పందించేందుకు ముందుకు వస్తున్నాడు. రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్‌ ను వేలాది కుటుంబాలు దేవుడు అంటూ కీర్తిస్తున్నాయి. అలాంటి సోనూసూద్‌ ను కలిసేందుకు తెలంగాణ రాష్ట్రం పరిగికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి కలిసేందుకు ముంబయి పాదయాత్ర మొదలు పెట్టాడు. హైదరాబాద్ నుండి అతడి పాద యాత్ర మొదలు అయ్యింది.

పాదయాత్రను మొదలు పెట్టిన వెంకటేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి నడుపుతున్న ఆటో ను బ్యాంక్ వారు సీజ్ చేశారు. ఈఎంఐ కట్టలేని కారణంగా ఆటోను సీజ్‌ చేయడంతో మా నాన్న మానసికంగా కృంగిపోయారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఆటోను నడిపించలేక పోయిన నాన్న ఈఎంఐ లు కట్టలేదు. దాంతో ఆటోను సీజ్‌ చేశారు.. ఈ సమయంలో ఎంతో మందికి సాయంగా నిలుస్తున్న సోనూసూద్‌ తన తండ్రి కోసం సాయం చేస్తాడనే నమ్మకంతో ముంబయికి వెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్‌ నుండి ముంబయికి 720 కి.మీ వరకు ఉంటుంది. అంత దూరంను కాలి నడకన వెళ్లి సోనూసూద్‌ ను కలిసేందుకు వెంకటేష్‌ చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. సోనూసూద్ ను ట్యాగ్‌ చేస్తూ చాలా మంది వెంకటేష్‌ వీడియోను మరియు అతడి పరిస్థితిని గురించి వెళ్లడించే ప్రయత్నం చేశారు. వెంకటేష్‌ గురించి సోనూసూద్‌ ఎలా రియాక్ట్‌ అవ్వబోతున్నాడు.. అతడి తండ్రి ఆటో ను బ్యాంకు వారి నుండి విడిపించేందుకు సాయం చేస్తాడా అనేది చూడాలి.