Begin typing your search above and press return to search.

ఎనిమీ కోసం థమన్ స్వరపరిచిన 'పడదే' సాంగ్..!

By:  Tupaki Desk   |   21 Aug 2021 1:18 PM IST
ఎనిమీ కోసం థమన్ స్వరపరిచిన పడదే సాంగ్..!
X
కోలీవుడ్ స్టార్ హీరోలైన విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌ గా నటిస్తోంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'ఎనిమీ' నుంచి ''పడదే'' అనే ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియోని వదిలారు.

'అడెడే నిను చూసే కనులే.. నీ స్నేహం కోసం కదిలే.. అదిగో నిన్ను చూస్తేనే.. ఏదో కొంచం సంతోషములే..' అంటూ సాగిన ఈ పాటకు థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. 'పడదే' సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. సింగర్ పృథ్వీ చంద్ర ఆలపించారు. ఈ పెప్పీ సాంగ్ విశాల్ - మృణాళిని లపై షూట్ చేయబడింది. ఇందులో విశాల్ డ్యాన్స్ మూవ్స్ అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

'ఎనిమీ' చిత్రంలో విశాల్ హీరోగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ - మమతా మోహన్ దాస్ - తంబి రామయ్య - కరుణాకరన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్‌డి రాజశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రేమాండ్ డేర్రిక్ క్రాస్తా ఎడిటింగ్ వర్క్ చేశారు. మినీ స్టూడియోస్‌ పతాకంపై ఎస్. వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.