Begin typing your search above and press return to search.

పా రంజిత్ మరో భారీ ప్రాజెక్ట్!

By:  Tupaki Desk   |   3 Aug 2018 4:18 AM GMT
పా రంజిత్ మరో భారీ ప్రాజెక్ట్!
X
అదేదో సినిమాలో ఓ కమెడియన్ "అదృష్టం కిలో బైట్లలో ఉంటే దరిద్రం గిగా బైట్లలో ఉందిరా" అంటూ తన గోడు ఫ్రెండుకి చెప్పుకుంటాడు. కానీ 'కబాలి' డైరెక్టర్ పా రంజిత్ వ్యవహారం మాత్రం క్వైట్ ఆపోజిట్. దరిద్రం కేబీలో ఉంటే అదృష్టం జీబీల్లో ఉంది! మరి లేకపోతే పెద్ద పెద్ద హేమహేమీలైన డైరెక్టర్లకే సూపర్ స్టార్ రజినిని డైరెక్ట్ చేసే అవకాశం లభించదు. అలాంటిది అతి తక్కువ సమయంలో 'కబాలి' అవకాశం వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది అంటే 'టీజర్ మాత్రం సూపర్.. సినిమా సంగతి అడగొద్దు'.

మరి ఆ సినిమా తర్వాత రంజిత్ అదృష్టం జీబీల్లోంచి టీబీలోకి వెళ్లి 'కాలా' అవకాశం అచ్చింది. 'కాలా' ఎలా ఉంది అనే అసందర్భపు ప్రశ్న అడిగి రజినీని - అయన అల్లుడు ధనుష్ ని - ఆ సినిమా హిట్టయిందంటూ చెప్పుకుంటున్న జనాలను ఇబ్బంది పెట్టొద్దు. మరి అంత సూపర్ హిట్ అయిన తర్వాత పా రంజిత్ కు మరో భారీ అవకాశం రాకుండా ఉంటుందా? ఈ సారి అదృష్టం టీబీల్లోంచి పీబీ ల్లోకి వెళ్లి ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చి పా రంజిత్ పాకెట్లో పడింది.

నమహ పిక్చర్స్ అనే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వారు పా రంజిత్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిలిం ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారట. స్టొరీ ఇంతటితో అయిపోతే పా రంజిత్ ను లక్కీ అని ఎందుకంటారు ? ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరు అని మీరడగరా? బాలీవుడ్ మీడియా గాసిప్పుల ప్రకారం అయితే హీరో అమీర్ ఖాన్ అట! ఇక మాట్లాడేందుకు ఏమీ మిగల లేదు.. కబాలి డైరెక్టర్ ఓ నక్క తోకను పర్మనెంట్ గా కొనుక్కొని అయన ఇంట్లో డోర్ మ్యాట్ లాగా పెట్టుకున్నాడో ఏంటో.. మీరు వీలైతే అమెజాన్ లోనో - ఫ్లిప్ కార్ట్ లోనో దొరుకుతుందేమో చూడండి.. వీలైనంత త్వరగా దరిద్రాన్ని వదిలించుకోండి!