Begin typing your search above and press return to search.

సొంత కార్.. సొంత ఇల్లు.. జ్యో‌త‌క్క‌నా మ‌జాకానా!

By:  Tupaki Desk   |   9 May 2020 3:30 PM GMT
సొంత కార్.. సొంత ఇల్లు.. జ్యో‌త‌క్క‌నా మ‌జాకానా!
X
యాంక‌ర్ గా రాణించి అటుపై బిగ్ బాస్ షోకి ఎంపికై సెల‌బ్రిటీ హోదాని ఆస్వాధిస్తున్న జ్యోత‌క్క అలియాస్ యాంక‌ర్ శివ‌జ్యోతిని ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే లేదు. ప్ర‌ముఖ వార్తా చానెల్ లో నిరంత‌రం నైజాం యాస‌లో వార్త‌లు చ‌దివే జ్యోత‌క్క ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఎంచుకున్న రంగంలో రాణించి లైఫ్ లో తాను అనుకున్న రెండు ల‌క్ష్యాల్ని జ్యోత‌క్క సాధించుకున్నార‌ట‌. ఆ సంగ‌తిని త‌నే చెప్పారు మ‌రి.

ఇంత‌కీ ఆ రెండు ఏమిటి? అంటే .. ఒక‌టి కోరుకున్న వాడినే ప్రేమించి పెళ్లాడ‌డం.. రెండోది సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డం. అవి రెండూ సాధ్య‌మ‌య్యాయ‌ని ఇంత‌కంటే ఆనందం ఇంకేం ఉంటుంద‌ని జ్యోతి ఎమోష‌న‌ల్ అయిన క్ష‌ణ‌మిది. బిగ్ బాస్ సీజ‌న్ 3 లో టాప్ 5 కంటెస్టెంట్ గా జ్యోత‌క్క పార్టిసిపేష‌న్ ని ఎవ‌రూ ఇంకా మ‌ర్చిపోలేదు. ఈ షో పుణ్య‌మా అని లైఫ్ లో బాగానే సెటిల‌య్యారు. సొంత ఇల్లు సొంత కార్ ద‌క్కాయి. ప్రేమించిన గంగూలీ అనే యువ‌కుడినే పెళ్లాడాను అని తెలిపింది.

ఇక జ్యో‌తక్క ఇంటికి సంబంధించిన వీడియోని స్టార్ చానెల్ రిలీజ్ చేసింది. యూట్యూబ్ లో ఇది అందుబాటులో ఉంది. ఆ ఇల్లు చూడ‌గానే క‌ళ్లు చెద‌రాల్సిందే. అద్భుత‌మైన ఇంటీరియ‌ర్ డిజైన్ తో క‌ళ్లు చెదిరే లుక్ తో ఆక‌ట్టుకుంది. ఇంట్లో విశాల‌మైన హాల్ .. గ‌దులు.. పూజ రూమ్.. వ‌గైరా వ‌గైరా ఆక‌ట్టుకున్నాయి. డైనింగ్ హాల్.. వంట గ‌ది.. డ్రెస్సింగ్ టేబుల్.. ఫ్యాన్.. బీరువా రూమ్ ఆక‌ట్టుకున్నాయి. గ్లాస్ మెటీరియ‌ల్ తో రిచ్ లుక్ లో అద్భుతంగా డిజైన్ చేయించ‌డం విశేషం. బిగ్ బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ ఇంత‌కుముందు ఖ‌రీదైన బెంజ్ కార్ ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు కూడా త‌న‌కంటూ ఓ సొంత ఇంటిని కొనుక్కున్నారు. కంటెస్ట్ లో యాంక‌ర్ శ్రీ‌ముఖి ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.