Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీలో బిగ్ బాస్ భామ

By:  Tupaki Desk   |   2 Oct 2017 4:56 AM GMT
ఫోటో స్టోరి: బికినీలో బిగ్ బాస్ భామ
X
మ్యాగజైన్ ఫోటో షూట్స్ ప్రభావం మొన్నటి వరకు బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకి ఈ గాలి బాగానే సోకింది. సౌత్ లో అప్పుడప్పుడు ఎవరో ఒకరు కనిపించే వారు. అది కూడా స్టార్ హీరోయిన్స్ అయితేనే.. మ్యాగజైన్ లకి పోజులిచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎన్ని హిట్టు సినిమాల్లో నటించారన్నది పాయింట్ కాదు. ఎంత ఫెమాస్ అయ్యారాన్నేదే పాయింట్. అవును ఇప్పుడు నేషనల్ లెవెల్ మ్యాగజైన్స్ వారు బయట ఆదరణ ఎక్కువగా ఎవరికుంటే వల్లనే ఫోటో షూట్స్ కి పిలిపిస్తున్నారు.

ఇప్పుడు అదే తరహాలో బిగ్ బాస్ తో ఎంతో ఫేమస్ అయిన పార్టీసీపెంట్ ప్రముఖ JFW (జస్ట్ ఫర్ ఉమెన్) మ్యాగజైన్ కి ఫోటో షూట్స్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ్ లో ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన ఓవియా హెలెన్. ఇంతకుముందు అందరికీ తెలిసినా ఎవరు అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ తమిళ్ బిగ్ బాస్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచే తమిళనాట అమ్మడి పేరు మారు మ్రోగిపోయింది. బిగ్ బాస్ లో ఉన్నది కొన్ని రోజులే.. అయినా కూడా చాలా పాపులర్ అయ్యింది. షోలో జరిగిన పరిణామాలతో మరియు కాంట్రోవర్సీలతోనే అందరి మనస్సులను గెలుచుకుంది. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ వేరొకరు అయినా ప్రజల్లో ఓవియాకే ఎక్కువ ఆదరణ దక్కింది. దీంతో అమ్మడికి సినిమాలో అంతగా ఛాన్సులు రాకపోయినా ఈవెంట్స్ కి షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లి రెమ్యూనరేషన్ ని బాగానే అందుకుంటోంది. ఇక ప్రస్తుతం అమ్మడు మరొక కొత్త అవతారం ఎత్తింది.

JFW మ్యాగజైన్ కి స్పెషల్ ఫొటో షూట్ ఇచ్చింది ఒవియా. అపుడపుడు సినిమాల్లో కాస్త గ్లామర్ గా కనిపించేది కాని ఫొటో షూట్ లో మాత్రం కాస్త ఘాటును పెంచేసింది. తన అసలు సెక్సీ అందాలను గ్లామర్ డ్రెస్సులతో బయటపెట్టింది. దాదాపు బికినీ వేసినంత పని చేసింది. నల్లటి డ్రెస్సులో ఆమె అందాలు నల్లటి మబ్బులో దాగున్న నక్షత్రం లా మెరుస్తున్నాయి. ఇక సెక్సీ గా ఉన్న ఆమె చూపులకు ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే!!