Begin typing your search above and press return to search.

టాప్ ప్లేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్‌

By:  Tupaki Desk   |   16 Feb 2018 8:39 AM GMT
టాప్ ప్లేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్‌
X
ఇప్ప‌డిప్పుడు సినిమాల్లోకి ఎంట‌ర్ అవుతున్న ఓ కుర్ర హీరోయిన్‌... సీనియ‌ర్ హీరోయిన్ల‌ను తొక్కి ప‌డేసింది. చేతిలో పెద్ద‌గా సినిమాలు లేక‌పోయినా... ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆమె ఇంకెవ‌రో కాదు ఒవియా. అదేనండి త‌మిళ బిగ్ బాస్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అమ్మాయి. ఆ షోలో ఆమె ఆత్మాహ‌త్యాయ‌త్నం కూడా చేసింది.

ప్ర‌తి ఏడాది టైమ్స్ సంస్థ ఆన్‌ లైన్ ఓటింగ్ ప‌ద్ద‌తి ద్వారా మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ ను ఎంపిక చేస్తుంది. 2017కు గాను మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌ని ఓటింగ్ పెడితే... ఎక్కువ శాతం మంది ఒవియాకే ఓటేశారు. గతేడాది టాప్ లో నిలిచిని న‌య‌న తార ఈసారి రెండో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక స‌మంత‌ - త‌మ‌న్నా లాంటి న‌టీమ‌ణులు... టాప్ టెన్‌ లో కూడా నిల్చోలేక‌పోయారు. అన్న‌ట్టు ఒవియా మొన్న విడుద‌లైన త‌రుణ్ సినిమా ఇది నాల‌వ్ స్టోరీలో హీరోయిన్‌ గా చేసింది.

ఒవియా త‌రువాత న‌య‌న‌తార రెండో స్థానంలో - ర‌కుల్ మూడో స్థానంలో నిలిచారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ అయిదు - అమీ జాక్స‌న్ ఆరు - ఆండ్రియా జెరెమియా ఏడు స్థానాల్లో నిలిచారు. గ‌తేడాది రెండు...మూడు... అయిదు స్థానాల్లో నిలిచిన త‌మ‌న్నా - స‌మంత‌ - శ్రుతి హాసన్ ఈసారి... 17... 16...21 స్థానాల్లో స‌ర్దుకు పోయారు.