Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ స్టార్‌ అడల్ట్‌ మూవీకి మిశ్రమ స్పందన

By:  Tupaki Desk   |   2 March 2019 2:32 PM GMT
బిగ్‌ బాస్‌ స్టార్‌ అడల్ట్‌ మూవీకి మిశ్రమ స్పందన
X
తమిళ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 తో అనూహ్యంగా గుర్తింపు దక్కించుకుంది ఓవియా. తెలుగులో కౌశల్‌ కు ఏ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారో - కౌశల్‌ ఆర్మీ ఎలా ఫామ్‌ అయ్యిందో అదే విధంగా ఓవియా ఆర్మీ అంటూ కూడా ఫామ్‌ అయ్యి - ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు అయ్యారు. ఓవియా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను అభిమానించే వారి సంఖ్య తగ్గలేదు. ఓవియా సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్‌ అంతా కోరుకున్నారు. అంతా కోరుకున్నట్లుగానే ఓవియా సినిమా చేసింది. అయితే ఆ సినిమా అడల్ట్‌ మూవీ.

'90 ఎంఎల్‌' అనే టైటిల్‌ తో ఓవియా ఒక సినిమా చేసింది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ వచ్చింది. ఆ ట్రైలర్‌ మరీ అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగా కలిగి ఉందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఓవియా ఆర్మీ కూడా చివరకు ఆమెపై విమర్శలు చేయడం జరిగింది. విమర్శల మద్య విడుదలైన '90 ఎంఎల్‌' చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇది బాలీవుడ్‌ మూవీ 'వీరి ది వెడ్డింగ్‌' మూవీకి కాపీలా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

అడల్ట్‌ కంటెంట్‌ మరీ ఎక్కువ ఉన్న '90 ఎంఎల్‌' చిత్రంను మాస్‌ ప్రేక్షకులు ఆధరిస్తున్నా - ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రం పూర్తి దూరంగా ఉంటున్నారు. యూత్‌ ఆడియన్స్‌ ను కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబడుతుందనే నమ్మకం మాత్రం తమిళ ట్రేడ్‌ వర్గాల వారిలో వ్యక్తం అవ్వడం లేదు. వీకెండ్‌ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి.