Begin typing your search above and press return to search.
మెగా హీరో సినిమాకి ఓవర్ సీస్ లో ఇబ్బందులు తప్పవా..?
By: Tupaki Desk | 2 Dec 2020 6:00 PM ISTకోవిడ్-19 ప్రభావం నుంచి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవడం.. థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక థియేటర్స్ తెరచుకోడానికి అనుమతులు వచ్చినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కి మేకర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రిటర్న్స్ వస్తాయో రావో అనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాను నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ చేయాలా.. డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలా అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్.. చివరకు థియేట్రికల్ రిలీజ్ కే ఓటేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నప్పటికీ యూఎస్ లో విడుదల అవుతుందో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి అన్ని సినిమాలకూ తలెత్తుతోందట. ఒకవేళ ఇప్పుడు రిలీజ్ చేసినా రైటర్స్ రాబట్టడం చాలా కష్టమే. దీంతో సాయి ధరమ్ తేజ్ మూవీకి యూఎస్ కలెక్షన్స్ కి బ్రేక్ పడినట్లే అని అంటున్నారు. నిజానికి మన సినిమాలు ఎక్కువగా ఓవర్ సీస్ బిజినెస్ పైనే ఆధారపడుతుంటాయి. అక్కడ విడుదలైన ప్రతి సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొన్ని సినిమాలు రెవిన్యూ పరంగా ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ.. ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల బయటపడుతుంటాయి. కానీ ఇప్పుడు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వసూళ్లు కీలకం కానున్నాయి. అలానే ఈ సినిమా ఫలితాన్ని బట్టి మిగతా సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.