Begin typing your search above and press return to search.

కష్టకాలంలో ఓవర్సీస్ మార్కెట్

By:  Tupaki Desk   |   7 Jun 2019 7:23 AM GMT
కష్టకాలంలో ఓవర్సీస్ మార్కెట్
X
మేం తీసిందే సినిమా డబ్బులిచ్చి చూడండి అంటే అమాయకంగా నమ్మేసే ప్రేక్షకులున్న ట్రెండ్ కాదిది. వాళ్ళను మెప్పించే కంటెంట్ లేకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో మొదలుకుని ఓవర్సీస్ దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడైనా స్టార్ హీరోలు తమ ఇమేజ్ తో సేఫ్ అవ్వోచ్చేమో కాని ఏ మాత్రం రొటీన్ అనిపించినా ఫలితం ఇంకోలా ఉంటుందని మహర్షితో యుఎస్ ఆడియన్స్ రుజువు చేశారు.

దీని సంగతి అలా ఉంచితే ప్రతి గురువారం లేదా శుక్రవారం కొత్త తెలుగు సినిమాలు వస్తున్నాయే కాని ఒకదాన్ని మించి మరొకటి తీసికట్టుగా ఉండటంతో వసూళ్లు మరీ దారుణంగా ఉంటున్నాయి. నిన్న విడుదలైన హిప్పితో ఇది పతనావస్థకు చేరుకుంది. యూత్ ట్రెండ్ పేరుతో నాసిరకరంగా హిప్పిని ప్రెజెంట్ చేయడంతో ఫిగర్స్ ని బయట పెట్టుకోలేనంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడం పరిస్థితికి అద్దం పడుతోంది

గత కొంత కాలంగా ఇలాగే ఉన్న సిచువేషన్ ఇంకో నెల కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. చెప్పుకోదగ్గ సినిమాలేవీ వచ్చే నెలలో షెడ్యూల్ చేయలేదు. అన్ని మీడియం బడ్జెట్ మూవీసే ఉన్నాయి. వీటికి అక్కడి బయ్యర్లు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. సాహో వచ్చేది ఆగస్ట్ లోనే. ఆపై నెల వెంకీ మామ ఉంది. అక్టోబర్ వస్తే సైరా దండయాత్ర మొదలవుతుంది.

అప్పటి దాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎబిసిడి-ఫలక్ నుమా దాస్ లాంటి సినిమాలు యుఎస్ లోనూ మంచి రిలీజులు దక్కించుకున్నప్పటికి కనీస స్థాయిలో మెప్పించలేక తుస్సుమన్నాయి. ఈ స్తబ్దత ఇంకొద్ది రోజులు కొనసాగుతుంది కాబట్టి అక్కడి ప్రేక్షకుల సంగతేమో కాని బయ్యర్లకు మాత్రం ఇది టెస్టింగ్ టైంగా నిలవబోతోంది