Begin typing your search above and press return to search.

లేని బజ్ ని చూపించారా ?

By:  Tupaki Desk   |   30 Aug 2019 9:56 AM GMT
లేని బజ్ ని చూపించారా ?
X
నిన్నదాకా సాహో బాహుబలిని కొట్టేస్తుందన్న ప్రచారంతోనే అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకున్న మాట వాస్తవం. ఇలాంటి సినిమా మళ్లి వస్తుందో రాదో అనే రేంజ్ లో పబ్లిసిటీ జరగడంతో బెనిఫిట్ షోలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందులోనూ 300 కోట్ల బడ్జెట్ అనే మాట పదే పదే మంత్రంలా వెళ్లిపోయింది. అంత ఖర్చు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే బాహుబలిని క్రాస్ చేసే ఉద్దేశం ఉంటె దానికి ధీటైన కంటెంట్ కాని ప్రీ రిలీజ్ బజ్ కాని కనిపించాలి. నిజానికి ఈ రెండు సాహో విషయంలో మిస్ అయ్యాయి.

సోషల్ మీడియాలో హంగామా కనిపించింది కాని బాహుబలి టైంలో ఉన్న బజ్ తో పోల్చుకుంటే సాహో వెనుకబడిన మాట వాస్తవం. ముఖ్యంగా బాహుబలి 2 విషయంలో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న టాపిక్కే ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చింది. దానికి తోడు ట్రైలర్ లో తీసుకున్న జాగ్రత్త శాంపుల్ గా చూపించిన మైండ్ బ్లోయింగ్ విజువల్స్ దానికి చాలా ప్లస్ అయ్యాయి.

ఇక ఆడియో సంగతి సరేసరి. ఒక్క టైటిల్ సాంగే సినిమా రేంజ్ ని పెంచేసింది. ఇలాంటి అనుకూలాంశాలు సాహోకు రిలీజ్ కు ముందు ఏ ఒక్కటీ లేవు. అందుకే బజ్ ఆ స్థాయిలో లేదన్న వాస్తవం కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు అధిక ధరల వల్ల పూర్తిగా ఫిల్ కాకపోవడాన్ని సాక్ష్యంగా చూపిస్తోంది. మాస్ లోనూ దీని మీద చెప్పుకోదగ్గ ఆసక్తి కనిపించలేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే టర్న్ అయ్యేవాళ్ళేమో కాని ఇప్పుడున్న టాక్ ని బట్టి చూస్తే అది కష్టమే అనిపిస్తోంది