Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహజ్వాలలు.. ఆలయంలో బూతు సన్నివేశాలే కారణం..!

By:  Tupaki Desk   |   23 Nov 2020 12:20 PM IST
నెట్‌ఫ్లిక్స్‌పై  ఆగ్రహజ్వాలలు.. ఆలయంలో బూతు సన్నివేశాలే కారణం..!
X
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న నెట్​ఫ్లిక్స్​ను వెంటనే నిషేధించాలని పలు హిందూసంఘాలు, నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. ట్విట్టర్​, ఫేస్​బుక్​ వంటి సామాజిక మాధ్యమాల్లో #BoycottNetflix అన్న హాష్​ట్యాగ్​ ప్రస్తుతం ట్రెండింగ్​గా మారింది. గత కొన్నిగంటల నుంచి ఈ హాష్​ట్యాగ్ అత్యధికంగా ట్రెండ్ అయ్యింది. అసలు కారణం ఇదే.. నెట్​ఫ్లిక్స్​లో కొన్ని వారాలుగా ‘ఏ సుటబుల్​ బాయ్​’ అనే వెబ్​సీరిస్​ ప్రసారం అవుతోంది. అయితే ఈ వెబ్​సీరిస్​లో కథపరంగా ఓ హిందూ అమ్మాయిని.. ఓ ముస్లిం యువకుడు ప్రేమిస్తుంటాడు. మొదటి నుంచి ఈ వెబ్​సీరిస్​పై విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఎపిసోడ్​లో సదరు ముస్లిం యువకుడు.. ఓ గుడిలో హిందూ అమ్మాయిని ముద్దుపెట్టుకొనే సీన్​ ఉంది.

ఆ దేవాలయంలో కొందరు భక్తులేమో భజనలు చేస్తుంటే ముస్లిం యువకుడు మాత్రం.. అమ్మాయితో రొమాన్స్​ చేస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ సీన్​పై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సన్నివేశం లవ్​జీహాదిని ప్రోత్సహించేలా ఉన్నదని.. ఈ సినిమాను, నెట్​ఫ్లిక్స్​ను వెంటనే నిషేధించాలని వాళ్లు డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇప్పటికే 66 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.

మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ విషయంపై స్పందించారు. ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని కోరారు. మరోవైపు ట్విట్టర్​లో ఈ విషయంపై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఓ యువతి ట్విట్టర్లో శృంగారశిల్పాలు ఉన్న ఓ ఆలయ చిత్రాన్ని పోస్ట్​చేశారు. ‘ఇదే మనదేశ సంస్కృతి.. కానీ మీరేమో సంస్కృతి పాడైపోతుందని తెగ ఫీలవుతున్నారు..’ అంటూ ట్వీట్​ చేశారు. మొత్తానికి ఇవాళ నెట్​ఫ్లిక్స్​ను బ్యాన్​చేయాలంటూ కొన్ని వేల సంఖ్యలో ట్వీట్లు వచ్చాయి. దానికి మద్దతుగా వచ్చిన ట్వీట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రేమించే వాళ్లంతా నెట్​ఫ్లిక్స్​ను అన్​ఇన్​స్టాల్​ చేసుకోవాలని ఓ వ్యక్తి ట్విట్టర్​ వేదికగా పిలుపునిచ్చాడు. నెట్​ఫ్లిక్స్​ మనదగ్గర డబ్బులు తీసుకొని మన సంస్కృతిని వెక్కిరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.