Begin typing your search above and press return to search.
మన సూపర్ స్టార్ కృష్ణ ‘కౌబాయ్’ వచ్చి 50 ఏళ్లు
By: Tupaki Desk | 26 Aug 2021 4:42 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం ప్రత్యేకం. ఆయన సినిమాలంటే లేడీస్ తెగ చూసేవారు. అందం, ఆకర్షణతో ఆకట్టుకునే కృష్ణ సినిమాలంటే అందరికీ పిచ్చి.. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ఏదంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ ని చెప్పొచ్చు. పద్మాలయ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చి రేపటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.ఇందులో కృష్ణ విజయనిర్మల హీరో హీరోయిన్లుగా నటించగా...ప్రధాన విలన్ గా కైకాల సత్యనారాయణ నటించారు. ఈ సందర్భంగా కృష్ణ ఆ చిత్రం విశేషాలు చెప్పుకొచ్చారు.ఆయన మాటల్లోనే..
ఆరోజుల్లో కౌబాయ్ గెటప్లో చిత్రం తీయడమంటే మాటలు కాదు. ఎందుకంటే కొత్తగా అందరినీ మెప్పించే పాత్ర కాదు. అయితే కృష్ణ ధైర్యం చేసి ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి చిత్ర బృందం ఎంతో కష్టపడింది. ఈ సంద్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘పద్మాలయ సంస్థ నిర్మించిన రెండో సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు. నేను చెన్నైలో రిలీజ్ అయిన ‘గడ్ బాడ్ అగ్లీ’ సినిమా చూశాను. ఈ సినిమా చూసిన తరువాత తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని అనుకున్నాను. దీంతో ఆరుద్రను ఈ సినిమాను చూడమని చెప్పాను. అతను సినిమా చూసిన తరువాతా ఈ సినిమాతో పాటు ‘మెకన్నాస్ గోల్డ్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను జోడించి కథ తయారు చేశాడు.
కథ విన్న తరువాత బాగా నచ్చింది. వెంటనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే విజయలలిత నటించిన ‘రౌడీ రాణి’ చిత్రం విడుదలయింది. దీనికి దాస్ దర్శకుడు. ఈ సినిమా నచ్చడంతో ఆయనను ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేశాం. అయితే సినిమాను రాజస్థాన్లో తీయాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో కలర్లో సినిమా తీయడమంటే ఖర్చుతో కూడుకున్న పని. అయినా రిస్క్ చేసి కలర్లో తీశాం. అయితే కొన్ని అదనపు ఖర్చులను తగ్గించుకున్నాం.
ఈ క్రమంలో ఫ్లైట్ టికెట్స్ కేవలం నాలుగు మాత్రమే బుక్ చేశారు. మిగతా వారందరినీ ట్రైన్లో రమ్మని చెప్పాం. అలా రాజస్థాన్ వరకు దర్శకుడు దాస్, చాయగ్రహకుడు స్వామి, డాన్స్ మాస్టర్ హీరాలాల్ మిగతా వాళ్లంతా ట్రైన్లోనే వచ్చారు. నేను, విజయనిర్మల, జయలలిత, నాగభూషణం మాత్రమే ఫ్లైట్లో వెళ్లాం. రాజస్థాన్లోషూటింగ్ తీసేటప్పుడు అనే కష్టాలు ఎదురయ్యాయి. నేను ఎక్కిన గుర్రం నన్ను రెండుసార్లు పడేసింది. ఆ తరువాత దానిని మచ్చిక చేసుకొని షూటింగ్ కొనసాగించాం. అలా రాజస్థాన్లో షూటింగ్ పూర్తి చేసుకొని షిమ్లాకు వెళ్లాం.
ఈ సినిమా గురించి తెలిసిన తరువాత చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా చక్రపాణి గారికి ఈ సినిమా అస్సలు నచ్చలేదు. సాధారణంగా చక్రపాణి గారు సినిమా బాగా లేదంటే.. ఇక అంతే. కానీ ఈ సినిమా విషయంలో ఆయన అంచనాలు తప్పాయి. ఎన్టీఆర్ ఈ సినిమా చూసి ‘బాగా తీశావ్ బ్రదర్.. కాకపోతే లేడీస్ ప్రేక్షకులను రానీయకుండా చేశావ్ ’ అని అన్నారు. అయితే ఎన్టీఆర్ చెప్పిన విధంగా సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. కానీ మేము అనుకున్న బడ్జెట్ మాత్రం వచ్చింది. ’ అని అన్నారు.
ఈ సినిమాలో ప్రధాన విలన్ గా కైకాల సత్యనారాయణ నటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు రకరకాల కామెంట్లు వచ్చాయి. రాజస్థాన్లో షూటింగ్ అంటే ఎలా ఉంటుందోనని అందోళన పడ్డా. అనుకున్నట్లుగా గానే అక్కడ గుర్రంపై స్వారీ చేసేటప్పుడు 30 అడుగుల లోతులో పడ్డా. అయితే నాపై గుర్రం పడితే నేను ఇలా ఉండేవాడిని కాకపోవచ్చు. గుర్రం, నేను పక్కపక్కన పడ్డాం. దీంతో నాకేమీ కాలేదు. ’ అని అన్నారు.