Begin typing your search above and press return to search.

మన సూపర్ హీరో పాన్ వరల్డ్‌ మూవీ 'హనుమాన్‌' రిలీజ్ డేట్ ఫిక్స్‌

By:  Tupaki Desk   |   9 Jan 2023 1:30 PM GMT
మన సూపర్ హీరో పాన్ వరల్డ్‌ మూవీ హనుమాన్‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌
X
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యి సెన్షేషన్ క్రియేట్‌ చేసిన విషయం తెల్సిందే. వందల కోట్ల బడ్జెట్‌ సినిమాల యొక్క విజువల్స్ మాదిరిగా ఈ సినిమా యొక్క విజువల్స్ మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి అంటూ టీజర్ పై పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

బ్రహ్మాస్త్ర మాత్రమే కాదు ఏ అస్త్రం కూడా ఈ సినిమా యొక్క విజువల్స్ మీదకు రావు అంటూ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కూడా హనుమాన్ యొక్క గ్లిమ్స్ కు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సూపర్ హీరో హనుమాన్ యొక్క నేపథ్యంతో ఈ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ సినిమా యొక్క కథ ఏంటీ అనేది క్లారిటీ రాలేదు.

అయినా కూడా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగాయి. సినిమాకు పెరిగిన అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. అంతే కాకుండా గ్రాఫిక్స్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. నేడు ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 12వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

తెలుగు లో మాత్రమే కాకుండా ఈ సినిమాను హిందీ.. మరాఠీ.. తమిల్‌.. కన్నడం.. మలయాళం.. ఇంగ్లీష్‌.. స్పానిష్‌.. కొరియన్‌.. చైనీస్‌.. జపనీస్‌ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. సినిమా కాన్సెప్ట్‌ నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో తేజా సజ్జా కు జోడీగా అమృత అయ్యర్‌ నటించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.