Begin typing your search above and press return to search.

కరోనా సీజన్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న ఓటీటీలు..!

By:  Tupaki Desk   |   11 May 2021 12:00 PM IST
కరోనా సీజన్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న ఓటీటీలు..!
X
క‌కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. టాలీవుడ్ కు గతేడాది కంటే మహమ్మారి ఈసారి పెద్ద సినిమా చూపిస్తోంది. జూనియర్ ఆర్టిస్టులు - టెక్నిషియన్స్ దగ్గర నుంచి పెద్ద స్టార్స్ వరకు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరూ సినిమా షూటింగ్స్ నిలిపేసి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి.. సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఒకవేళ కరోనా తీవ్రత తగ్గి థియేటర్స్ ఓపెన్ చేసినా జనాలు ఇప్పట్లో సినిమాలు చూడటానికి వస్తారనే గ్యారెంటీ లేకుండా పోయింది. గతేడాది కరోనా భయం ఉన్నప్పటికీ ఇప్పుడు సెకండ్ వేవ్ కి ఉన్నంత స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో ఫిలిం మేకర్స్ అందరూ మళ్ళీ ఓటీటీల వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పట్లో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో పలువురు నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజుల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ తో డీల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది మాదిరిగా సీజన్‌ ను క్యాష్ చేయడానికి ఓటీటీలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు తన సినిమా రిలీజ్ కోసం ప్రముఖ ఓటీటీతో సంప్రదింపులు జరపగా.. డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ ఆఫర్ చేసిన డీల్ కు నిర్మాత షాక్ అయ్యారట. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు ఓటీటీలు సినిమా తీసుకోడానికి ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఏర్పడిన బజ్ తో పాటుగా అందులో నటించిన నటీనటులు - సాంకేతిక నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకుని సినిమాని కొనుక్కోవాలని ఓటీటీలు ఆలోచిస్తున్నాయట.

అందుకే ప్రస్తుతం సినిమాలు ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాయట. ముఖ్యంగా చిన్న సినిమాలు - పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాల విషయంలో ఓటీటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఓటీటీలు కూడా నష్ట పోతున్నాయి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దాదాపు అన్ని రాష్ట్రల్లో లాక్ డౌన్ ప్రతిపాదనలు వస్తున్నాయి. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఓటీటీలకు అదే సరైన సమయం. ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకొని సబ్ స్క్రైబెర్స్ ని పెంచుకోవాలంటే.. ఫ్రెష్ కంటెంట్ ని అందించాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఓటీటీలు ఎలాంటి కంటెంట్ తో ఆదరణ తెచ్చుకుంటాయో చూడాలి.