Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో ఓటీటీల హవా ఇలానే కొనసాగుతుందా...?

By:  Tupaki Desk   |   9 May 2020 8:00 AM IST
రాబోయే రోజుల్లో ఓటీటీల హవా ఇలానే కొనసాగుతుందా...?
X
లాక్ డౌన్ తో సినీ పరిశ్రమ మూతబడిపోయింది. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలను.. సోషల్ మీడియాలను ఆశ్రయిస్తున్నారు. టీవీల్లో వచ్చిన సినిమాలే రిపీటెడ్ గా వేస్తున్నారు.. సీరియల్స్ విషయానికొస్తే కొత్త ఎపిసోడ్స్ షూట్ చేయకపోవడంతో ఆల్రెడీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ మళ్ళీ చూపిస్తున్నారు. దీంతో జనాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సినిమాలను డైరెక్టుగా ఓటీటీలలో విడుదల చేస్తుండటంతో జనాలు వాటిని చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని కారణముగా లాక్ డౌన్ లో ఓటీటీల హవా నడుస్తున్నదని చెప్పవచ్చు. అయితే ఓటీటీల హవా ఇంకెన్ని రోజులు నడుస్తుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే వెండితెర మీద అయినా.. బుల్లితెర మీద అయినా.. ఓటీటీలలో అయినా కంటెంట్ ఉన్నంత వరకే జనాలు ఆదరిస్తారు. ఇప్పుడు టీవీలలో రిపీటెడ్ కంటెంట్ చూపిస్తున్నారని ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. కానీ కొన్ని రోజులకి ఓటీటీలలో కూడా కొత్త కంటెంట్ అయిపోతే. ఇప్పటికే షూటింగ్స్ చేసి రెడీగా పెట్టుకున్న సినిమాలు వెబ్ సిరీసులు ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని వెబ్ సిరీసులు.. సినిమాలు ఆన్లైన్ లో వదిలేసారు. ఈ నేపథ్యంలో ఓటీటీలలో కూడా కొత్త కంటెంట్ వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు ఓటీటీలు ఆల్రెడీ షూటింగులు జరుపుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఒకవేళ నిర్మాతలు ఓటీటీలలో సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడినప్పటికీ.. వాటితో ఓటీటీలు ఎన్ని రోజులని నెట్టుకొస్తాయి.

ఇప్పుడు పరిస్థితి చూస్తే షూటింగులు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్త వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణం జరగడం అసాధ్యం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఓటీటీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓటీటీలలో వెబ్ కంటెంట్ చూసేసిన ఆడియన్స్ తర్వాత రోజుల్లో అవే చూపిస్తే వీటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. లాక్ డౌన్ ఎత్తేసి వీలైనంత త్వరగా షూటింగ్స్ స్టార్ట్ అవకపోతే రాబోయే రోజుల్లో ఓటీటీల హవా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కలవరపడుతున్నాయట. త్వరగా లాక్ డౌన్ ఎత్తేస్తే తమ ఓన్ కంటెంట్ తో అయినా షూటింగ్స్ చేసుకొని ప్రేక్షకులకు కొత్త కంటెంట్ ఇవ్వొచ్చని ఆలోచిస్తున్నారట. మరి రాబోయే రోజుల్లో ఓటీటీల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.