Begin typing your search above and press return to search.
డైరెక్టర్లతో చర్చలు ప్రారంభించిన ఓటీటీలు!
By: Tupaki Desk | 27 April 2020 3:20 PM ISTఒటీటీలు గతంలో కూడా ఉన్నాయికానీ లాక్ డౌన్ పుణ్యామా అని వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. టీవీ ఛానెల్స్ లో జనాలు ఎక్కువ చూసేవి మూడు. న్యూస్.. సీరియల్స్ సినిమాలు. న్యూస్ అంత కరోనా స్తోత్రాలే. దీంతో ఎక్కువ సేపు చూడలేకుండా ఉన్నారు. కొత్త సీరియల్స్ ఆగిపోవడంతో పాతవి చూడాల్సి వస్తోంది.. దీంతో వాటికి గడ్డుకాలం వచ్చింది. టీవీ ఛానెల్ లో ఒక సినిమాను లక్షా ఒకటోసారి చూసే ఓపిక ఈకాలంలో ఎవరికీ లేదు. పైగా రెండు గంటలసినిమాకు నాలుగు గంటల వాయింపుడు ఎవరు భరిస్తారు? దీంతో దాదాపు అందరూ ఒటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు.
దీంతో ఓటీటీ వేదికలు కూడా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి. ఒక వైపు థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయిన సినిమాల నిర్మాతలో ఇప్పటికే చర్చలు సాగిస్తున్నాయి. మరోవైపు వెబ్ సీరీస్.. వెబ్ ఫిలింల నిర్మాణానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాయట. హిందీ.. ఇంగ్లీష్ లో ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ ల నిర్మాణం ఊపందుకుంది కానీ తెలుగుకు వచ్చేసరికి ప్రాధమిక దశలోనే ఉంది. దీంతో ఒటీటీలు ప్రముఖ దర్శకులతో తమకు కంటెంట్ డిజైన్ చేయాలని సంప్రదింపులు జరుపుతున్నాయట. కొన్ని ప్రాజెక్టులకూడా ఈ లాక్ డౌన్ సమయంలోనే ఫైనలైజ్ చేస్తున్నారని.. లాక్ డౌన్ విరమణ ప్రకటించగానే అవి పట్టాలెక్కుతాయని అంటున్నారు.
టాలెంటెడ్ ఫిలిం మేకర్లు అయిఉండి కమర్షియల్ సక్సెస్ లేని కొందరు డైరెక్టర్లకు ఇది జాక్ పాట్ లా మారుతోందని అంటున్నారు. వీరినే కాకుండా కొందరు ప్రముఖ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నాయట. వారు ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులకు కమిట్ అయి ఉండడంతో ఫ్యూచర్ లో కలిసి పని చేసే దిశగా ఆఫర్లు ఇస్తున్నాయట. మొత్తానికి తెలుగులో ఒటీటీలు సంచలనం సృష్టించడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.