Begin typing your search above and press return to search.

కొత్త సినిమా రిలీజ్.. టైం చెప్పండయ్యా

By:  Tupaki Desk   |   23 Oct 2020 12:17 PM GMT
కొత్త సినిమా రిలీజ్.. టైం చెప్పండయ్యా
X
కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజైతే ఎప్పుడు షో పడుతుందనే క్లారిటీ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలకు కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు అర్ధరాత్రి, తెల్లవారుజామున పడుతుంటాయి కానీ.. మిగతా సినిమాల విషయంలో ఏ గందరగోళం ఉండదు. ఆయా థియేటర్లలో రెగ్యులర్ టైమింగ్స్‌ను బట్టి షోలు వేస్తుంటారు. మల్టీప్లెక్సుల్లో షోలకు సంబంధించి టికెట్ బుకింగ్ యాప్స్‌లో టైమింగ్స్ స్పష్టంగా ఉంటాయి. ఐతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజవుతున్న కొత్త సినిమాల విషయంలోనూ ఇలాంటి క్లారిటీ మిస్సవుతోంది. కరోనా వల్ల ఏడు నెలల కిందట థియేటర్లు మూతపడ్డాక ఓటీటీల్లో కొత్త సినిమాలు నేరుగా రిలీజైపోతున్న సంగతి తెలిసిందే. ఐతే వాటిలో షో సరిగ్గా ఎంత టైంకి పడుతుందనే విషయంలో క్లారిటీ ఉండట్లేదు. దీని గురించి ఇటు నిర్మాతలు కానీ, అటు ఓటీటీలు కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయడం లేదు.

కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజవుతున్న అమేజాన్ ప్రైమ్ సంగతే తీసుకుంటే.. అందులో సెర్చ్ ఇంజిన్ ఎంత దారుణంగా ఉంటుందో, కొత్త సినిమాల రిలీజ్ టైమింగ్ కూడా అంత అయోమయంగా ఉంటుంది. మామూలుగా ఓటీటీల్లో అర్ధరాత్రి 12 గంటలకు సినిమా రిలీజ్ చేస్తుంటారు కానీ.. అమేజాన్ కొన్ని గంటల ముందే సినిమా స్ట్రీమ్ చేసేస్తుంటుంది. ఒక సినిమాను పదిన్నరకు.. ఇంకో సినిమాను తొమ్మదిన్నరకు.. ఇలా ఒక్కోసారి ఒక్కో టైమింగ్‌లో సినిమాను వదిలేస్తుంటారు. మిగతా ఓటీటీలు కూడా నిర్దిష్ట సమయం అంటూ పాటించట్లేదు. టాలీవుడ్లో రాబోతున్న కొత్త చిత్రం ‘కలర్ ఫోటో’ విషయానికి వస్తే.. 23న రిలీజ్ అన్నారు. దీంతో నెటిజన్లు నిన్న అర్ధరాత్రి ‘ఆహా’ తెరిచి కూర్చున్నారు. కానీ సినిమా ఏమో స్ట్రీమ్ కావట్లేదు. ట్విట్టర్లో ఆహా టీం కానీ, చిత్ర బృందం కానీ తమ అకౌంట్లలో టైమింగ్ గురించి మెన్షన్ చేయలేదు. తీరా చూస్తే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రిమియర్ అన్న పోస్టర్లు కనబడ్డాయి. మిగతా ఓటీటీలు సైతం కొత్త సినిమాల రిలీజ్ టైమింగ్ విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. ఇంత ప్రచారం చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నపుడు వీక్షకులకు ఈ టైమింగ్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడంపై ఎవ్వరూ ఎందుకు దృష్టిసారించట్లేదో మరి.