Begin typing your search above and press return to search.

ఓటీటీలు బాగానే ఉంటాయి.. మరి ఏటీటీల పరిస్థితి ఏంటి..?

By:  Tupaki Desk   |   9 Jan 2021 6:00 AM IST
ఓటీటీలు బాగానే ఉంటాయి.. మరి ఏటీటీల పరిస్థితి ఏంటి..?
X
కరోనా లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడిచింది. అప్పటికే ఉన్న డిజిటల్ వేదికలతో పాటు అనేక కొత్త ఓటీటీలు - ఏటీటీలు వీక్షకులకు ల్ అందుబాటులోకి వచ్చాయి. ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ అవడంతో మళ్ళీ థియేట్రికల్ రిలీజులు ఊపందుకున్నాయి. 50శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల అవ్వగా.. సంక్రాంతికి మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ ఆలోచించారు.

ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజులు ఊపందుకున్నా ఓటీటీల పరిస్థితి బాగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే డిజిటల్ రైట్స్ రూపంలో సినిమా థియేట‌ర్స్ లో రిలీజైన కొన్ని రోజులకు ఓటిటిలో స్ట్రీమింగ్ కి పెడతారు. నిర్మాత‌ల‌కి కూడా ఓటీటీలు ఉండ‌టం అవ‌స‌ర‌మే. ఇక ఏటీటీల విషయానికొస్తే క‌రోనా లాక్ డౌన్ టైమ్ లో హ‌ల్ చ‌ల్ చేసిన చాలా ఏటిటిలు ఇంక స‌ర్వైవ్ అవ్వ‌డం కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే డ‌బ్బులు పెట్టి మ‌రీ మొబైల్ లో సినిమా చూసేంత ఖాళీగా జ‌నాలు ఇకపై ఉండ‌క‌పోవ‌చ్చు. ఒకవేళ అదే టైమ్ దొరికితే ఆ డ‌బ్బుల‌తో థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూడ‌టానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతార‌ని నిపుణ‌లు చెబుతున్నారు. ఇదే సమయంలో థియేటర్ కి వెళ్లి సినిమా చూడ‌టం ఎక్స్ పీరియెన్స్ అయితే.. ఏటిటిలో సినిమా చూడ‌టం క‌న్వీనియెన్స్ అనేవారు లేకపోలేదు. ఏదేమైనా ఆడియెన్స్ దేని వైపు మొగ్గు చూపుతున్నార‌నే విష‌యం మాత్రం ఆయా పద్ధతుల్లో విడుద‌ల‌య్యే సినిమాల కంటెంట్ మీదనే ఆధార‌ప‌డి ఉంటుందని చెప్పవచ్చు.