Begin typing your search above and press return to search.
నాలుగు సినిమాలను ఓటీటీకి అమ్మేసిన స్టార్ హీరో..!
By: Tupaki Desk | 5 Aug 2021 3:22 PM ISTకరోనా నేపథ్యంలో థియేటర్లు మూతబడటంతో నిర్మాతలకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయంగా మారాయి. పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నా.. చిన్న మీడియం బడ్జెట్ చిత్రాలను డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓటీటీ విడుదలకు ముందడుగు వేసిన ఫస్ట్ హీరో సూర్య అనే చెప్పాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలోనే థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో తాను నిర్మించిన 'పొన్మగల్ వంధాల్' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి పెట్టారు.
సూర్య పై ఆ సమయంలో థియేటర్ల యాజమాన్యాలు - డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సూర్య నిర్మించే సినిమాలను థియేటర్ లలో విడుదల చేయబోమని తీర్మానం చేశారు. అయితే ఆ తర్వాత కోవిడ్ విజృంభనతో అందరికీ ఓటీటీ దిక్కు అవడంతో సైలెంట్ అయ్యారు. ఇదే క్రమంలో సూర్య నటిస్తూ నిర్మించిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ విధంగా డైరెక్ట్ ఓటీటీ విధానంలో సినిమాని విడుదల చేసిన ఫస్ట్ స్టార్ హీరోగా సూర్య నిలిచాడు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటున్నాయి. కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతున్నా.. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఇక తమిళనాడులో మాత్రం ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా సినిమాలు చూడటానికి థియేటర్లకు జనం వస్తారో లేదో అనే సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూర్య తాను నిర్మిస్తున్న నాలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ''జై భీమ్'' సినిమాతో పాటుగా 'రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్' 'ఉదంపిరప్పే' 'ఓ మై డాగ్' చిత్రాలను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నాలుగు చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నాయి. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 'జై భీమ్' చిత్రాన్ని నవంబర్ లో రిలీజ్ చేస్తున్నారు.
శశి కుమార్ - జ్యోతిక ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం ''ఉదంపిరప్పే''. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ పెట్టనున్నారు. అరుణ్ కుమార్ లీడ్ రోల్ లో శారోవ్ షణ్ముగం రూపొందించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే జ్యోతిక - సూర్య నిర్మించిన 'రామే ఆండాలుమ్ రావనే ఆండాలుమ్' మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు.