Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటిటి సినిమాలు..!

By:  Tupaki Desk   |   30 Jun 2021 6:02 PM IST
ఈ వారం ఓటిటి సినిమాలు..!
X
లాక్డౌన్ కారణంగా ఎప్పుడైతే థియేటర్స్ క్లోజ్ అయిపోయాయో.. అప్పటినుండి డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు పండగే అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితిలో బడా మూవీస్ నుండి స్మాల్ బడ్జెట్ మూవీస్ వరకు అన్ని ఓటిటి బాటపడుతున్నాయి. ఆల్రెడీ గతేడాదిన్నర కాలంగా ఓటిటి సంస్థలు లాభాలతో కళకళలాడుతున్నాయి. అయితే థియేట్రికల్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా తీరా టైం ముగిసింది అనిపించే సరికి నేరుగా ఓటిటి బాటపడుతున్నాయి. ఇప్పటివరకు అప్ కమింగ్ హీరోల నుండి సల్మాన్ ఖాన్ లాంటి బడాహీరోలు కూడా ఓటిటిలకు రెడీ అయిపోతున్నారు.

అయితే సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటి నుండి పలు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చనే పర్మిషన్ ప్రభుత్వాలు కల్పించాయి. కానీ ఇంకా ఎందుకు రిస్క్ అని భావించి నేరుగా ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. కనీసం ప్రతి వారానికి రెండు సినిమాలైనా ఓటిటిలలో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎక్కువగా జులై నెలలోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ వారం మాత్రం అందుబాటులోకి ప్రస్తుతం నాలుగు రెడీ అయిపోయాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

1. 'కోల్డ్ కేసు' మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జూన్ 30 నుండి అంటే ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ తను బాలక్ దర్శకుడుగా మారాడు. ఈ చిత్రంలో అదితి బాలన్ హీరోయిన్.

2. లోకి: మార్వెల్స్ వారి ఫస్ట్ సిరీస్ ఇది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ గా తెరకెక్కింది. అయితే ఆల్రెడీ ఓటిటిలో ఇంగ్లీష్ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ జూన్ 30 నుండి నాలుగు ఎపిసోడ్స్ కలిపి తెలుగులో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

3. హసీన్ దిల్రుబా: లవ్ లస్ట్ మర్డర్.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఈ చిత్రం. స్టార్ హీరోయిన్ తాప్సీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. క్రైమ్ తో పాటు మాంచి మసాలా రొమాంటిక్ సీన్స్ కూడా జోడించి తెరకెక్కించాడు దర్శకుడు వినీల్ మాథ్యూ. ఈ చిత్రం జులై 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

4. పొగరు: కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా అల్లుడు ధృవ్ సార్జా ఈ సినిమాలో హీరోగా నటించాడు. మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. జులై 2 నుండి పొగరు తెలుగు వెర్షన్ ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.