Begin typing your search above and press return to search.
ఓటీటీ డల్.. థియేటర్ నిల్..
By: Tupaki Desk | 18 Dec 2020 10:02 AM ISTకరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది మార్చిలో థియేటర్లు మూతపడ్డాయి. అప్పటి నుంచి అసలైన సినిమా టేస్ట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు ప్రేక్షకులు. సినిమా హాళ్లకు తాళాలు పడ్డ కొంతకాలానికి ‘నేనున్నా ప్రేక్షకుడా..’ అంటూ ముందుకొచ్చాయి ఓటీటీ సంస్థలు. ఎక్కువగా చిన్న సినిమాలే విడుదలైనా.. ఒకటీ రెండు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ స్క్రీన్ పై సందడి చేశాయి. నవంబర్ నెల వరకు వివిధ భాషల్లో రికార్డు స్థాయిలో కొత్త చిత్రాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి.
సౌత్ చిత్రాాల హవా..
దక్షిణాది సినిమాలు కూడా ఓటీటీలను అట్రాక్ట్ చేశాయి. తమిళంలో సూర్య నిర్మించి నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) వంటి భారీ చిత్రంతో పాటు.. మిస్ ఇండియా, మిడిల్ క్లాస్ మెలోడీస్, మా వింత గాథ వినుమా, అంధకారం లాంటి సినిమాలు నవంబరులో ఆడియన్స్ ను అలరించాయి. దీంతో.. ఓటీటీల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని, దీనివల్ల డిసెంబరులోనూ కొత్త సినిమాలు విడుదల అవుతాయని, ఇందులో పెద్దలు సినిమాలు కూడా ఉండొచ్చని ప్రేక్షకులు ఆశించారు. కానీ పరిస్థితి రివర్స్ అయ్యింది.
కొత్త సినిమాలేవీ..?
అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొక్కటి అన్నచందంగా ఉంది ప్రేక్షకుడి పరిస్థితి. డిసెంబర్ లో పెద్ద సినిమాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాలు కూడా దిక్కు లేవు. ఈ నెలలో ప్రముఖ ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు విడుదల కాలేదు. ‘డర్టీ హరి’ అంటూ ఎం.ఎస్.రాజు పే పర్ వ్యూ పద్ధతిలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇది మినహాయిస్తే ఈ నెలలో కాస్త పేరున్న సినిమా కూడా ఏదీ ఓటీటీల్లో రిలీజ్ కావట్లేదు. క్రిస్మస్ సీజన్లో కూడా కొత్త సినిమాలను ప్లాన్ చేయలేదు ఆయా సంస్థలు.
థియేటర్లలోనూ..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. కానీ.. వాటిల్లో ప్రదర్శించడానికే సినిమాలు లేవు. ఓటీటీలో రిలీజై, ఆ తర్వాత బుల్లి తెరపై ప్రదర్శితమై జనాాల్ని ఆకర్షించలేకపోయిన ‘వి’ మూవీ తిరిగి థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం.. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏ సినిమా లేదు. అది కొన్ని రోజులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఆ తర్వాత థియేటర్ల నిర్వాహకులు ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. అంతో ఇంతో హైప్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ చిత్రం జనాలను ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. దీంతో.. థియేటర్లు వెలవెలబోతున్నాయి. మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో షోలు ఆపేస్తున్నారు. అయితే.. క్రిస్మస్ నాటికి థియేటర్లలో రిలీజ్ చేయడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి, ఈ డల్ సీజన్లో అది ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.