Begin typing your search above and press return to search.
సెన్సార్ బోర్డ్ పరిధిలోకి ఓటీటీ కంటెంట్...?
By: Tupaki Desk | 21 July 2020 3:00 PM ISTప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్, ఆహా అని చాలా ఓటీటీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలు ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు వీక్షకులకు అందుబాటులో ఉంచుతున్నాయి. అంతేకాకుండా థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఈ ఓటీటీలలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్నా.. వాటిలో వచ్చే కంటెంట్ మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో మేకర్స్ రెచ్చిపోయి అస్లీల దృశ్యాలు.. అస్లీల కంటెంట్ చూపించేస్తున్నారు. దీంతో ఫ్యామిలీతో కలిసి ఓటీటీలలో వచ్చే కంటెంట్ ని చూడాలంటే ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ మరియు ఇండిపెండెట్ సినిమాలు ఓటీటీల్లో అప్లోడ్ చేయాలంటే సెన్సార్ తప్పనసరి చేసే విధంగా కేంద్రం కసరత్తలు చేస్తోందని సమాచారం.
వాస్తవానికి ఓటీటీలలో కంటెంట్ ని చాలా మంది ఆడియెన్స్ చూడడానికి అసలు కారణం వాటిలో ఉండే భూతులు మరియు హాట్ హాట్ సన్నివేశాలు మాత్రమే అనేది ఓపెన్ సీక్రెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా యూత్ ఓటీటీల్లో వచ్చే ఇలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న చాలా వెబ్ సిరీస్ లు ఒరిజినల్ మూవీస్ చూస్తే ఇది మనకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో అప్లోడ్ చేసే కంటెంట్ ని కూడా సెన్సార్ బోర్డ్ కి క్రిందకు తెస్తే ఈ భూతులకు మరియు భూతు సన్నివేశాలకు కత్తెరలు పడతాయి. దీంతో ఓటీటీలకు ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని సెన్సార్ బోర్డ్ కిందకు తీసుకురావడం కష్టసాధ్యమైన పని. కనుక వారిపై కొత్తగా ఆంక్షలు విధించే రీతిన సెంట్రల్ గవర్నమెంట్ కసరత్తులు చేస్తున్నారని సమాచారం.
కాగా ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో యథేచ్ఛగా అసభ్య కంటెంట్ ప్రసారం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'వెబ్ కంటెంట్ కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేకుండా పోయిందని.. విదేశీ కంటెంట్ అనువాదానికి కూడా ఓ హద్దు ఉంటుందని.. మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలు సమాజం, నైతిక విలువలు దృష్టిలో పెట్టుకొని అనువాదాలు చేయాలని.. ఓటీటీలలో స్వీయ నియంత్రణ ఉండాలని' పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెబ్ కంటెంట్ పై ఆంక్షలు విధిస్తే కనుక ఓటీటీ వారు సెన్సార్ చేసిన కంటెంట్ నే కొనుక్కొవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇదే రూల్ ని శాటిలైట్ రైట్స్ విషయంలో అప్లై చేశారు. మరి రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.