Begin typing your search above and press return to search.

'లైగర్' కు రూ.200 కోట్ల ఓటీటీ ఆఫర్.. 'అది చాలా తక్కువ' అంటూ VD ట్వీట్..!

By:  Tupaki Desk   |   21 Jun 2021 5:30 PM GMT
లైగర్ కు రూ.200 కోట్ల ఓటీటీ ఆఫర్.. అది చాలా తక్కువ అంటూ VD ట్వీట్..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ఉపశీర్షిక. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'లైగర్' రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సినీ వర్గాల్లో టాక్ ప్రకారం 'లైగర్' మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మరియు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 200 కోట్ల రూపాయలను కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాలకు గానీ.. పూరీ సినిమాలకు గానీ ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ పై చిత్ర నిర్మాతలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వార్తలు వచ్చాయి. ఓటీటీ ఆఫర్ న్యూస్ VD చెవిన పడటంతో తాజాగా ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించాడు. రూ.200 కోట్లు అనేది చాలా తక్కువ అని.. నా సినిమా థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నాడు.

'లైగర్' ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్ ని కోట్ చేసిన విజయ్.. ''ఇది చాలా తక్కువ. నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ చేస్తాను'' అని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి వీడీ తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థం అవుతోంది. మరి ఇది యువ హీరోకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కాగా, 'లైగర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడం.. షూటింగ్ లకు అనుమతి ఇస్తుండటంతో పూరీ జగన్నాథ్ 'లైగర్' తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.