Begin typing your search above and press return to search.

క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఓటీటీల బేరసారాలు..!

By:  Tupaki Desk   |   5 Jun 2021 9:00 AM IST
క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఓటీటీల బేరసారాలు..!
X
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ డైరెక్ట్ ఓటీటీ రిలీజుల సందడి మొదలవుతోంది. గతేడాది చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయితే.. ఈసారి వారితో పాటుగా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో 'ఏక్ మినీ కథ'.. ఆహా లో 'థ్యాంక్ యు బ్రదర్' అనే చిన్న సినిమాలు స్ట్రీమింగ్ కి పెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' చిత్రాన్ని ఓకేసారి అందుబాటులో ఉన్న థియేటర్లలో ఓటీటీలో రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'జగమే తంత్రం' సినిమా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఓటీటీ సంస్థలు బేరసారాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీలైన నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వీడియోలు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఆర్థిక భారం మోయలేని కొందరు నిర్మాతలు ఓటీటీ ఆఫర్స్ పట్ల సంతృప్తిగా ఉన్నా.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు హీరోలు అంగీకరించకపోడంతో వెనకడుగు వేస్తున్నారని సమాచారం. 'టక్ జగదీష్' 'విరాటపర్వం' 'పాగల్' 'ఖిలాడి' వంటి సినిమాలు ఎంత లేట్ అయినా థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. బాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు ఓటీటల వైపు చూస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 'తుఫాన్' 'షేర్ని' వంటి సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. అలానే 'సూర్యవంశీ' '83' వంటి సినిమాల డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయని టాక్. మరి రాబోయే రోజుల్లో ఓటీటీ ఆఫర్లకు ఎంత మంది మేకర్స్ ముందుకు వస్తారో చూడాలి.