Begin typing your search above and press return to search.

పొరుగు భామ‌ల డామినేష‌న్ ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   4 Sept 2019 7:00 AM IST
పొరుగు భామ‌ల డామినేష‌న్ ఇంకెన్నాళ్లు?
X
తెలుగ‌మ్మాయిల్లో `మ‌హాన‌టి` అని పిలిపించుకునే వాళ్లు ఎవ‌రూ లేరేమిటి? ఎంద‌రో న‌వ‌త‌రం క‌థానాయిక‌లు వ‌స్తున్నా.. వీళ్లంతా మ‌ల్లూ భామ‌లు .. ముంబై బొమ్మ‌ల‌తో ఎందుక‌ని పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు? అందంలో త‌క్కువా..? అభిన‌యంలో మ్యాట‌ర్ లేదా? ఇది నిరంత‌రం క్రిటిక్స్ ని తొలిచేసే ప్ర‌శ్న ఇది. స్వాతి- బిందుమాధ‌వి- అంజ‌లి- ఇషా రెబ్బా- ప్రియాంక జ‌వాల్క‌ర్ - పూజిత పొన్నాడ‌.. ఇలా జ‌న‌రేష‌న్ మారుతున్నా .. అనూహ్య‌మైన స్టార్ డ‌మ్ తెలుగ‌మ్మాయిల్ని వ‌రించ‌డం లేద‌నే చెప్పాలి. అందం అభిన‌యం ఉన్నా.. ఎందుక‌నో జెట్ స్పీడ్ తో దూసుకుపోయిందేం లేదు. ఒక సావిత్రి - జ‌య‌ప్ర‌ద‌ - భానుప్రియ రేంజు క‌నిపించలేదేమిటో!

మ‌హాన‌టి గా పాపుల‌రైంది మ‌ల్లూ భామ కీర్తి సురేష్‌. జూ.సౌంద‌ర్య‌గా పాపుల‌రైంది నిత్యామీన‌న్. సావిత్రి అంత‌టి న‌టిగా కీర్తి .. సౌంద‌ర్య‌గా నిత్యా అసాధార‌ణ పాపులారిటీ ద‌క్కించుకున్నా ఈ రేసులో తెలుగ‌మ్మాయిలే క‌నిపించ‌లేదు. టాలీవుడ్ లో హవా సాగిస్తోంది నిరంత‌రం మ‌ల్లూ భామ‌లే. న‌య‌న‌తార‌-మీరా జాస్మిన్- అశిన్ వీళ్లంతా వెళ్లాక‌.. కొత్త తరంలో కీర్తి టాలీవుడ్ కోలీవుడ్ లో స‌త్తా చాటింది. ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. మ‌రోవైపు నిత్యా ఏకంగా అమ్మ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `ది ఐరన్ లేడీ` లో టైటిల్ పాత్ర‌ధారి గా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇక జ‌య‌ల‌లిత‌ పైనే తెర‌కెక్కిస్తున్న మ‌రో బ‌యోపిక్ లో క్వీన్ కంగ‌న‌ టైటిల్ పాత్ర పోషించ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రోభామ నివేధ థామ‌స్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు కొట్టేస్తూ వ‌రుస విజ‌యాలు అందుకుంటోంది.

మ‌న తెలుగ‌మ్మాయి అయిన విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్ స్మిత బ‌యోపిక్ లో విద్యాబాల‌న్ న‌టించింది. ఆ స్థాయి హొయ‌లు మ‌న తెలుగ‌మ్మాయిల‌కు కుద‌ర‌లేదు మ‌రి! మ‌ల‌యాళీలు కాక‌పోతే ముంబై బ్యూటీస్ వీళ్లేనా అంత పెద్ద స్టార్ డ‌మ్ అందుకునేది? ప‌్ర‌స్తుతం క‌న్న‌డ రంగం నుంచి వ‌చ్చిన ర‌ష్మిక అసాధార‌ణ స్టార్ డ‌మ్ అందుకుని మ‌న‌ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేస్తోంది. అస‌లు మ‌న తెలుగ‌మ్మాయిల‌కు అంత సీను లేనేలేదేమిటో? ఎందుక‌ని స్టార్ డ‌మ్ అందుకోలేక‌పోతున్నారు? ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగ‌మ్మాయిలు వ‌స్తున్నా ఎందుక‌నో మ‌ల్లూ భామ‌లు - ముంబై భామ‌ల వెల్లువ‌లో తేలిపోతున్నారు. డామినేష‌న్ అస్స‌లు క‌నిపించ‌డం లేదు. ఇరుగు పొరుగు భామ‌ల డామినేష‌న్ మ‌న ఇండ‌స్ట్రీలో ఇంకెన్నాళ్లు? తెలుగు బ్యూటీస్ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఇచ్చేదెపుడు?