Begin typing your search above and press return to search.
మొన్న సేతుపతి.. నిన్న వరలక్ష్మి.. ఇవాళ ఫాజిల్..!
By: Tupaki Desk | 11 July 2021 8:00 AM ISTకళాకారులకు సరిహద్దులు లేవు. వాళ్లు పలికించే భావాలకు భాష అడ్డుకాబోదు. అందుకే.. నటుడిలో సత్తా ఉండాలేగానీ.. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా.. ఎక్కడైనా నటించొచ్చు. నటుడు తన టాలెంట్ ఏంటన్నది చూపిస్తే చాలు.. అవకాశాలు ఇంటి ముందు క్యూ కడతాయి. దీనికి నిదర్శనంగా ఎంతో మంది నటులు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మోలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఇతనికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నామొన్నటి వరకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తనదైన సహజ నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన సేతుపతి.. ఉప్పెన ఘన విజయంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కరోనా వచ్చి విజయ్ ప్రభంజనాన్ని అడ్డుకుందిగానీ.. ఇంకా ఎన్నో చిత్రాల్లో సత్తా చాటేవాడు. ఇప్పుడు షూటింగులు మొదలైన తర్వాత కూడా మళ్లీ ఆ జోరు కొనసాగే ఛాన్స్ ఉంది.
సేతుపతితో పాటు కోలీవుడ్ నుంచి వచ్చిన మరో నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు ఫుల్లు డిమాండ్ ఉంది. సొంత తమిళులకన్నా.. తెలుగు ప్రేక్షకులు ఈమెను బాగా ఓన్ చేసుకుంటున్నారు. దీంతో.. అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 'తెనాలి రామకృష్ణ' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత వచ్చిన క్రాక్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పోషించిన జయమ్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రోల్‌లో భయపెట్టే నటనతో ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన నరేష్ 'నాంది' చిత్రంలోనూ వరలక్ష్మి నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి ఆయువు పట్టు ఆమేనని కూడా అన్నారు. ఇప్పుడు బాలయ్యతో గోపీచంద్ తీబోతున్న సినిమాతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు సైతం వరలక్ష్మి చేతిలో ఉన్నాయి.
ఇప్పుడు.. కేరళ నుంచి ఫహద్ ఫాజిల్ ఇంపోర్ట్ అవుతున్నాడు. పాత్రలో లీనమైపోయే అద్భుతమైన నటుడిగా పేరుగాంచిన ఫహద్.. ఇప్పటికే టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. బన్నీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దాదాపు ఐదారుగురు విలన్లు ఉన్నారని టాక్. వీరందరిలో టాప్ మోస్ట్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు ఫహద్. అయితే.. ఇప్పుడు మరో చిత్రంలోనూ ఫహద్ నటించబోతున్నట్టు టాక్.
ఎప్పటి నుంచో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ సినిమాలో ఫాజిల్ కనిపించనన్నట్టు టాక్. అప్ కమింగ్ మూవీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ చేస్తున్న మూవీ 'ఏజెంట్'. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ ను 'ఏజెంట్'గా చూపించబోతున్నాడు. అనిల్ సుంకర - ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ - సురేందర్-2 బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారు. ఈ స్పై జోనర్లో.. కీలక పాత్రలో నటించేందుకు ఫాజిల్ ను సంప్రదించినట్టు సమాచారం.
ఇదే చిత్రంలో.. సీనియర్ హీరో మమ్ముట్టి కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే.. ఈ మూవీలో మమ్ముట్టిది పాజిటివ్ పాత్ర కాగా.. ఫహద్ రోల్ నెగెటివ్ అని అంటున్నారు. మెయిన్ విలన్ గా ఫాజిల్ కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉంది. రెమ్యునరేషన్ కూడా హైలో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా.. ఫహద్ ఫాజిల్ తెలుగు తెరపై బలమైన ముద్రనే వేస్తున్నాడన్నది స్పష్టమవుతోంది. ఇలా.. భాషతో సంబంధం లేకుండా.. తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నారు పరభాషా నటులు.