Begin typing your search above and press return to search.

రాజమౌళికి ఆ సత్తా ఉందన్న ఆస్కార్‌ విజేత

By:  Tupaki Desk   |   20 Oct 2022 10:30 AM GMT
రాజమౌళికి ఆ సత్తా ఉందన్న ఆస్కార్‌ విజేత
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను ఆస్కార్‌ రేసులో నేరుగా నామినేట్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత తరపున దక్కని నామినేషన్స్ ను అంతర్జాతీయ స్థాయిలో సినిమాను పబ్లిసిటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం ద్వారా ఆస్కార్ రేసులో నిలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఈ సమయంలో రాజమౌళి గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రాజమౌళి గారు తీసిన మగధీర సినిమా చూసిన సమయంలో ఈయన ఇండియాలో గొప్ప దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు... పెద్ద సినిమాలు తీయగల సత్తా ఈయనలో ఉందని నేను అనుకున్నాను. తప్పకుండా రాజమౌళి నుండి పెద్ద సినిమాలు రాబోతున్నాయని ఆశించాను.

మగధీర సమయంలో తాను అనుకున్నట్లుగానే బాహుబలి సినిమాను తీసి తన అంచనా తప్పుకాదు అని నిరూపించాడు. తప్పకుండా రాజమౌళి వంటి దర్శకులు సినిమా ఇండస్ట్రీకి అవసరం అన్నట్లుగా రహమాన్‌ పేర్కొన్నాడు.

రాజమౌళి సత్తా ఏంటో బాహుబలి ని చూస్తేనే అర్థం అవుతుంది.. ఆయన నుండి గొప్ప సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను అన్నాడు.

రాజమౌళి సినిమాతో పాటు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా పై కూడా రహమాన్‌ ప్రశంసలు కురిపించారు. భారీ ఎత్తున అంచనాలు ఉన్న పొన్నియన్ సెల్వన్‌ అంచనాలకు తగ్గట్లుగా తమిళనాట భారీ వసూళ్లను నమోదు చేసింది.

ఇప్పటికే నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ సినిమా విజయం పట్ల రెహమాన్ హర్షం వ్యక్తం చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.