Begin typing your search above and press return to search.

ఓరి దేవుడా.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదా..?

By:  Tupaki Desk   |   21 Oct 2022 4:09 AM GMT
ఓరి దేవుడా.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదా..?
X
టాలీవుడ్ యువ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ తో ప్రయోగాలు చేస్తూ కమర్షియల్ సక్సెస్ అందుకుంటున్న హీరో విశ్వక్ సేన్. కథల విషయంలో అతనికున్న క్లారిటీ మంచి ఫలితాలను అందిస్తున్నాయి. అల్రెడె రైటర్, డైరక్టర్ కాబట్టి ఆమాత్రం క్లారిటీ ఉండాల్సిందే.

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించడానికి విశ్వక్ సేన్ ప్రయత్నిస్తున్నాడు. చివరగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ గా ఓరి దేవుడా అంటూ వచ్చాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఓరి దేవుడా సినిమా తమిళ ఓ మై కడవులే మూవీకి రీమేక్. మాత్రుక దర్శకుడు అశ్వత్ మరిముత్తునే తెలుగు వర్షన్ ని డైరెక్ట్ చేశారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగులో కూడా అదే రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ అనుకున్నారట.

సినిమాకు హే భగవాన్ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కానీ విశ్వక్ సేన్ ఇప్పటికే తన సినిమాలకు పాగల్, హిట్ అని హిందీ, ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేశాడు. అందుకే ఈసారి తెలుగు టైటిల్ నే పెట్టాలని ఓరి దేవుడా అని పెట్టారట. అంతేకాదు సాధారణంగా ఓరి దేవుడా అన్నది మనకి ఊతపదంగా వస్తుంది. ఏదైనా అనుకోని సంఘతన జరిగినప్పుడు అందరు ఓరి దేవుడా అంటారు. అందుకే ఈ టైటిల్ కి యూనిట్ మొత్తం ఓటేశారట.

ఓరి దేవుడా మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు. సినిమాకు ఆయన ఓ పెద్ద సెట్ అని అంటున్నారు. సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్ గా నటించగా లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు.

సినిమా ఆడియోలో కేవలం రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేయగా సినిమాలో మరో రెండు సూపర్ సాంగ్స్ ఉన్నాయని చెప్పాడు హీరో విశ్వక్ సేన్. ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.