Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఒరేయ్‌ బుజ్జిగా.. పనవుద్దా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 1:10 PM IST
ఫస్ట్ లుక్: ఒరేయ్‌ బుజ్జిగా.. పనవుద్దా?
X
యువ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాలో నటిస్తున్నాడు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరోయిన్ మాళవిక ఒక క్రికెట్ బ్యాట్ తో రాజ్ తరుణ్ ను కొట్టబోతున్నట్టుగా.. మరో కత్తితో పొడుస్తున్నట్టుగా ఉంది. అయితే రాజ్ తరుణ్ మాత్రం మాళవికను ఆపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మరి మాళవికకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్సే. ఈ సినిమా యూత్ ను.. ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే అంశాలతో తెరకెక్కుతున్నట్టుగా ఫిలింమేకర్స్ చెప్తున్నారు. మరి వరస ఫెయిల్యూర్ల తో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు ఈ సినిమా తో అయినా విజయం లభిస్తుందా అనేది వేచి చూడాలి.

ఈ సినిమాలో హెబా పటేల్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం విశేషం. వాణీ విశ్వనాథ్‌.. నరేష్‌.. పోసాని కృష్ణ మురళి.. సత్య.. మధు నందన్‌ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే 'ఒరేయ్ బుజ్జిగా' ప్రేక్షకుల ముందుకు రానుంది.