Begin typing your search above and press return to search.
బుజ్జిగా మారనున్న యూత్ హీరో?
By: Tupaki Desk | 1 Sept 2019 2:45 PM ISTడార్లింగ్ ప్రభాస్ పూరి కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు గుర్తుందిగా. కమర్షియల్ గా ఆ సినిమా మరీ గొప్ప విజయం సాధించనప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. తర్వాత ఆ పేరుతో మళ్ళీ ఏ హీరో ట్రై చేయలేదు. ఇన్నేళ్లకు యూత్ హీరో రాజ్ తరుణ్ బుజ్జిగా రాబోతున్నట్టు సమాచారం. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందబోయే మూవీకి ఒరేయ్ బుజ్జి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే టైంకి దీన్నే ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. గుండె జారీ గల్లంతయ్యిందేతో మొదటి సినిమాతోనే హిట్టు కొట్టిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఆ తర్వాత ఒక లైలా కోసం చేసి కొంత గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడీ ఒరేయ్ బుజ్జితో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోయిన్ గా మాళవిక నాయర్ ని ఫిక్స్ చేసినట్టు మరో న్యూస్. ఇదే సినిమాలో అదితి రావు హైదరి షాలిని పాండే ఇలా రకరకాల పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా మాళవిక దగ్గర బంతి ఆగినట్టు తెలిసింది.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్వీట్ లవ్ స్టోరీగా ఇది రూపొందనున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే ఫినిషింగ్ లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఇటీవలే జరిగిన యాక్సిడెంట్ కేసు పుణ్యమా అని మీడియాలో నానాడు. అది సమిసిపోయింది కానీ గత ఏడాది కాలంగా హిట్ లేని రాజ్ తరుణ్ ఇప్పుడీ ప్రాజెక్ట్స్ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు