Begin typing your search above and press return to search.
థియేటర్లు ఎప్పుడు తెరిచేదన్న దానిపై కేంద్రమంత్రి క్లారిటీ
By: Tupaki Desk | 4 Jun 2020 9:30 AM ISTలాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని అన్ని వాణిజ్య కార్యకలాపాలు (అత్యవసరం మినహా) బంద్ చేశారు. దేశ ప్రజల వినోదంలో అతి కీలకమైన సినిమా థియేటర్లను మూసివేయటం.. ఎప్పటికి తెరిచే అవకాశం ఉందన్న దానిపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తాముగా నిర్ణయం తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. దేశవ్యాప్తంగా 9,500 సినిమా థియేటర్లు ఉన్నాయని.. సినిమా టికెట్ల కొనుగోలు ద్వారానే ప్రభుత్వానికి నిత్యం రూ.30 కోట్లకు పైనే ఆదాయం వస్తుందన్నది అంచనా.
ఇంత ఆదాయాన్ని వదులుకోవటం కష్టమే అయినా.. థియేటర్లు ఒకసారి ఓపెన్ అయితే.. మాయదారి రోగాన్ని నిలువరించటం సాధ్యం కాదంటున్నారు.అందుకే.. సినిమా థియేటర్లను వీలైనంత ఆలస్యంగా తెరవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ.. సర్కారు ఓకే అన్నా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్నది మరో ప్రశ్న. లాక్ డౌన్ కారణంగా దారుణంగా దెబ్బ తిన్న పరిశ్రమలో సినీ రంగం కూడా ఒకటి.
ఇంతకీ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ సమాధానమిస్తూ.. జూన్ లో పాజిటివ్ కేసుల సంఖ్యను చూడటం.. దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందన్న అంశాలపై అధ్యయనం చేసిన తర్వాతే.. సినిమా థియేటర్ల ఓపెనింగ్ మీద నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. కేంద్రమంత్రి తాజా వ్యాఖ్యల్ని చూస్తుంటే.. జులై.. ఆగస్టుల్లో సినిమా థియేటర్లు తెరిచే వీలు లేదనే చెప్పాలి. ఇప్పటికే కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. థియేటర్లు ఓపెన్ చేస్తే.. పాజిటివ్ ల సంఖ్య మరింత పెరిగే వీలుంది. అందుకే.. అన్నింటికంటే చివర్లో అనుమతులు ఇచ్చే రంగం ఏదైనా ఉందంటే.. అది సినిమా థియేటర్లే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.