Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ.. హిందీ రీమేక్ కోసం త‌ప‌న‌!

By:  Tupaki Desk   |   27 Nov 2020 11:30 AM IST
ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ.. హిందీ రీమేక్ కోసం త‌ప‌న‌!
X
ఫ్లోలో ఉంటే ఫ్లాపులొచ్చినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఫ్లాప్ సినిమాల‌ను అయినా ఇష్టంగా కొనుక్కుని రీమేక్ చేస్తారు. లేదా అనువదించి రిలీజ్ చేస్తారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టించిన ఊస‌ర‌వెల్లి హిందీ రీమేక్ ఈ కేట‌గిరీనే అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ - త‌మన్నా జంట‌గా న‌టించిన ఊస‌ర‌వెల్లి ఎంత పెద్ద డిజాస్ట‌రో తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులో ఫ్లాపైన ఈ చిత్రాన్ని బెంగాలీలోనూ రీమేక్ చేసారు. అక్క‌డా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయినా ఇప్పుడు టిప్స్ సంస్థ హిందీలో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. అయితే హిందీ వెర్ష‌న్ లో మాత్రం చాలా మార్పులు ఉంటాయ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ జ‌రుగుతోంది. తారాగణం టెక్నీషియ‌న్ల‌ను త్వరలో నిర్ణయించనున్నారు.

హిందీ వెర్ష‌న్ హీరో ఎవ‌రు? అంటే... ప‌రిశ్ర‌మ అగ్ర హీరో అక్ష‌య్ కుమార్ న‌టించ‌నున్నారని తెలుస్తోంది. వైవిధ్య‌మైన కాన్సెప్టుల్ని ట్రై చేసే అక్ష‌య్ న‌టించిన లేటెస్ట్ మూవీ ల‌క్ష్మీ బాంబ్ ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.