Begin typing your search above and press return to search.

ఊపిరి లెక్క ఇంకా పక్కా కాలేదు!!

By:  Tupaki Desk   |   13 April 2016 12:34 PM IST
ఊపిరి లెక్క ఇంకా పక్కా కాలేదు!!
X
నాగార్జున - కార్తిల మల్టీస్టారర్ మూవీ ఊపిరి మంచి హిట్ నే కొట్టింది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఊపిరి శాటిలైట్ హక్కులకు భారీ ఆఫర్ వచ్చిందనే వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. ఊపిరి చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ్ శాటిలైట్ హక్కులను 14 కోట్ల రూపాయలకు ఓ ఛానల్ దక్కించుకుందనే వార్తలతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.

నాగార్జున గత చిత్రాలతో పోల్చితే.. ఇది రెట్టింపు మొత్తం కావడమే ఇందుకు కారణం. అయితే.. ఈ ఊపిరి 14 కోట్ల వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఇంకా తమ చిత్రానికి సంబంధించిన తెలుగు - తమిళ హక్కులు వేటినీ.. ఇప్పటివరకూ ఎవరికీ ఇవ్వలేదని, శాటిలైట్ రైట్స్ తమ దగ్గరే ఉన్నాయని.. నిర్మాణ సంస్థ పీవీపీ తేల్చేసింది. అయితే.. ఇంకా మాటలు నడుస్తున్నమాట మాత్రం వాస్తవమేనని చెప్పింది యూనిట్.

ఊపిరి శాటిలైట్ రైట్స్ కి సంబంధించిన డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని.. ఒకవేళ హక్కులను విక్రయిస్తే, తప్పకుండా వివరాలు వెల్లడిస్తామని చెబుతోంది పీపీపీ సంస్థ. అంతవరకూ ఇలాంటి రూమర్లను సూచించింది. అయితే.. ప్రస్తుత మార్కెట్ ప్రకారం.. ఈ 14 కోట్ల అమౌంట్ కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నాగ్ సినిమాకు 7-8 కోట్లు రావడం కష్టం కాకపోయినా.. ఈ మూవీ తమిళ్ వెర్షన్ హిట్ కాలేదు. అందుకే అక్కడ శాటిలైట్ 6 కోట్లకు సెట్ కావడం కష్టం అంటున్నారు.