Begin typing your search above and press return to search.

మిలియన్‌ డాలర్‌ క్లబ్‌ లో ఎంటరైంది

By:  Tupaki Desk   |   30 March 2016 10:36 AM GMT
మిలియన్‌ డాలర్‌ క్లబ్‌ లో ఎంటరైంది
X
కొన్ని సినిమాలు రిలీజ్ రోజున బ్రహ్మాండం అనే టాక్ వచ్చేస్తాయి. వీకెండ్ లో కలెక్షన్స్ కుమ్మస్తాయి. కానీ సోమవారం వచ్చేసరికి అసలు సినిమా కనిపిస్తుంది. అంత భారీ పాజిటివ్ ఏమైపోయిందో అర్ధం కాక, కలెక్షన్స్ కనిపంచక నిర్మాతలు తలలు బద్దలుకొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున, కార్తీల మూవీ ఊపిరికి మాత్రం ఈ పరిస్థితి ఎదురు కాలేదు. ప్రస్తుతం నాగ్ ఉన్న ఫాంతో తిరుగులేని విజయం సాధించే దిశగా సాగిపోతోంది ఊపిరి.

సోమవారం కనిపించిన స్థాయిలోనే మంగళవారం కూడా వసూళ్లు ఉండడం.. నిర్మాతను ఆనందంలో ముంచెత్తింది. బీ, సీ సెంటర్లలో అంతగా ఊపందుకోకపోయినా... మల్టీప్లెక్స్ లు, ఏ క్లాస్ సెంటర్లలో మాత్రం ఇరగదీసి ఆడేస్తోంది ఊపిరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చేవరకూ, వేరే భారీ సినిమా ఏదీ రిలీజ్ లేకపోవడంతో.. మరోవారం పాటు ఈ వసూళ్లు కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు అమెరికాలోనూ ఊపిరి ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లను దాటిపోయి, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనిపించేసుకుంది.

యూఎస్ బాక్సాఫీస్ లో ఈ మార్క్ అందుకున్న 17వ సినిమాగా ఊపిరి రికార్డుల్లోకి ఎక్కింది. వరుసగా మూడో చిత్రాన్ని కూడా బ్లాక్ బస్టర్ గా నిలపడంలో.. అక్కినేని నాగార్జున సక్సెస్ అయ్యారనే చెప్పాలి.