Begin typing your search above and press return to search.

ఊ అంటావా ఇంకా ఊపుతూనే ఉంది!

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:40 PM GMT
ఊ అంటావా ఇంకా ఊపుతూనే ఉంది!
X
ఏదైనా ఒక కొత్త‌ ట్రెండ్ బాగా ఎక్కింది అంటే దాని ఊపు వేరేగా ఉంటుంది. ఊ అంటావా ఊఊ అంటావా! సాంగ్ అలాంటి ట్రెండ్ ని కొన‌సాగిస్తోంది. పుష్ప - ది రైజ్ విడుద‌లై చాలా కాల‌మే అయ్యింది. తెలుగు-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఇప్ప‌టికీ ఈ సినిమా నుంచి పాట‌లు మోగుతున్నాయి. ఇందులో స‌మంత ఐట‌మ్ నంబ‌ర్ ఊ అంటావా అయితే ఎదురే లేకుండా అనుక‌ర‌ణ‌ల‌తో వేడెక్కిస్తూనే ఉంది.

ఇప్ప‌టికే చాలా మంది బాలీవుడ్ నాయిక‌లు ఈ పాట‌కు న‌ర్తించారు. తాజాగా బాలీవుడ్ యువ‌న‌టి స‌న్యా మల్హోత్రా వంతు. పుష్పా ది రైజ్‌లోని తన ప్రత్యేక పాట ఊ అంటావాను ప్రదర్శించినందుకు సామ్ నుంచి ప్రశంస‌లు అందుకుంది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లోకి సన్యా ఈ ట్రాక్ కి డ్యాన్సింగ్ వీడియోని జోడించింది. కానీ ఒక ప్ర‌త్యేక ట్విస్ట్ తో ఈ వీడియో ప్ర‌త్యేకంగా క‌నిపించింది.

వీడియోలో సన్యా మల్హోత్రా క్యాజువల్స్ దుస్తులు ధరించి ఉంది. మాచింగ్ ప్యాంటు వైట్ స్నీకర్లతో నలుపు రంగు టాప్ ధ‌రించి సింపుల్ గా క‌నిపించింది. షాజేబ్ షేక్ కొరియోగ్రఫీకి స‌న్యా డ్యాన్సుల్ని ప్రదర్శించింది. అయితే ఆమె తన సొంత‌ శైలిని పరిచయం చేసింది. క్లిప్ ను షేర్ చేస్తూ.. ఆమె మెరుపులు అంటూ డ్యాన్స్ ఎమోజీలను జోడించింది. ఆమె షాజెబ్ షేక్ టాన్జేరిన్ ఆర్ట్స్ స్టూడియోని ట్యాగ్ చేసింది. షాజెబ్ షేక్ కొరియోగ్రఫీ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది. ఈ పోస్ట్ పై మరియా గోరెట్టి స్పందిస్తూ ``లవ్ లవ్ లవ్ ఇట్`` అని రాశారు. డ్యామ్‌ గర్ల్ అని మృణాల్‌ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. ఎల్లవేళలా చంపేస్తావు! అంటూ కొంద‌రు వ్యాఖ్యానించ‌గా.. సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో "ఉఫ్ఫ్ఫ్ఫ్ఫ్ (ఫైర్ ఎమోజీలు) చాలా హాట్ అని రాసింది.

ఇంతకుముందు.. గాయని నేహా కక్కర్- మాజీ బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ - టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలీ పాల్ కూడా ఈ పాటకు డ్యాన్సులు వేసారు. స్వర భాస్కర్ - కృతి సనన్ కూడా ఈ పాటను మెచ్చుకున్నారు. స్వరా ట్వీట్ చేస్తూ.. “నేను ఈ పార్టీకి ఆలస్యంగా వచ్చానని నాకు తెలుసు! అయితే #పుష్ప చిత్రంలోని #ఊ అంటావాపై ట్రిప్పిన్... ఎంత ట్రిప్పీ కంపోజిషన్ పాట! స్త్రీల ఆబ్జెక్టిఫికేషన్ ను విమర్శిస్తూ ఒక ఐటెమ్ నంబర్ ను ప్రేమించడం!!! మరియు సమంతప్రభు2 (ఫైర్ ఎమోజీలు) (మెరుపు ఎమోజీలు)... అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. మొత్తానికి ఊ అంటావా ఇంకా ఊపుతూనే ఉంది.

ప్రత్యేక డ్యాన్స్ నంబర్ లో అల్లు అర్జున్ - స‌మంత కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇటీవల సాంగ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో అతను సమంత - అల్లు అర్జున్ లకు పాటకు స్టెప్పులు నేర్పిస్తూ క‌నిపించాడు. గణేష్ స్టెప్పులు వేసిన తర్వాత సమంత- అల్లు అర్జున్ నవ్వడం మొదలుపెట్టారు. సమంత చప్పట్లు కొడుతూ నవ్వుతూ క‌నిపించారు. అల్లు అర్జున్ గణేష్ ఆచార్య‌తో టైమింగ్ మ్యాట‌ర్ చ‌ర్చిస్తూ క‌నిపించాడు. ఆ ఇద్ద‌రితో హిట్ సాంగ్ లో చేసినందుకు ఆనందంగా ఉంద‌ని స‌మంత అన్నారు.