Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఇంకో ప‌దిహేను రోజులే..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:32 AM GMT
పుష్ప 2 ఇంకో ప‌దిహేను రోజులే..!
X
'పుష్ప-1' హిందీ బెల్ట్ లో సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత సుకుమార్ అండ్ టీమ్ ఆలోచ‌న మారిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ పై కేజీఎఫ్ 2 డామినేష‌న్ కూడా పుష్ప బృందానికి మ‌రింత బూస్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని ఆస్వాధించాల‌న్నా ఉత్త‌రాదిపై డామినేష‌న్ కొన‌సాగించాల‌న్నా ఇదే స‌రైన స‌మ‌యం. అదే క్ర‌మంలో పుష్ప 2 కాన్వాస్ అమాంతం మారిపోనుంద‌ని ప్ర‌చార‌మైంది. దానికి త‌గ్గ‌ట్టే తాపీగా స‌మ‌యం తీసుకుని స్క్రిప్టు ప‌రంగా పుష్ప 2 కంటెంట్ ని అసాధార‌ణంగా పుల్ చేసారని గుస‌గుస వినిపిస్తోంది. కొంత ఆలస్యం తర్వాత పుష్ప సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంద‌నేది తాజా వార్త‌.

పుష్ప 2 షూటింగ్ ఈ జూలైలో ప్రారంభమవుతుంది. జులైలో షూటింగ్ ని ప్రారంభించి ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనేది ఆలోచన. పుష్ప 2 మొదటి భాగం చిత్రీకరిస్తున్న సమయంలో కొంత భాగం చిత్రీకరించారు. మిగిలిన భాగాన్ని త్వరలో చిత్రీకరించనున్నారు. మొద‌టి భాగం కంటే రెండో భాగంలో యాక్ష‌న్ ప‌దింత‌లు అవుతుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. హిందీ మార్కెట్లో పుష్ప ఫ్రాంఛైజీకి ఉన్న హైప్ దృష్ట్యా యాక్ష‌న్ కంటెంట్ అసాధార‌ణంగా ఉండ‌బోతోంద‌న్న టాక్ ఇప్ప‌టికే స్ప్రెడ్ అయ్యింది. పుష్ప 2 బ‌డ్జెట్ స్కేల్ అమాంతం పెంచార‌ని టాక్ వినిపిస్తోంది. ఇది భారీ స్థాయిలో రాజీ అన్న‌దే లేకుండా తెర‌కెక్కుతుంది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా నిల‌వ‌నుంది.

చొక్కా లేకుండా తిరుగుతాన‌న్నాడు!

'పుష్ప' విజ‌యం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో రెట్టించిన ఉత్సాహం నింపింద‌ని చెప్పాలి. నిజానికి ఈ మూవీ అన్ని భాష‌ల్లోనూ మెప్పిస్తుంద‌ని తొలిగా చెప్పింది అల్లు అర్జున్. సుకుమార్ పై త‌న కాన్ఫిడెన్స్ ని ఏనాడూ అత‌డు దాచుకోలేదు. అందుకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో కూడా ఇప్పుడు వైర‌ల్ గా మారింది. సుకుమార్ కి దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ‌ దర్శకనిర్మాతల నుండి ప్రశంసలు అందకపోతే తాను షర్ట్ లేకుండా తిరుగుతానని బ‌న్ని అన్నారు. అత‌డి గెస్ ప్ర‌కార‌మే.. బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాణీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు. పుష్ప హిందీ వెర్ష‌న్ చూశాక చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ నుంచి అత‌డికి కాల్స్ వ‌చ్చాయి. పొగడ్త‌లు కురిసాయి.

ముఖ్యంగా ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌న చిత్రాల‌ ద‌ర్శ‌కుడు అయిన రాజ్ కుమార్ హిరాణీ నుంచి సుక్కూకి ప్ర‌శంస ద‌క్కింది. ఇది ఊహించ‌నిది. హిరాణీకి సుకుమార్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఇంత‌కుముందు పెను తుఫాన్ గా మారింది. హిరాణీ తన సంభాషణలో సుకుమార్ ను వ్యక్తిగతంగా కలుస్తానని .. సుకుమార్ ముంబైకి వచ్చినప్పుడల్లా త‌న‌కు కాల్ చేయమని లేదా సంక్షిప్త‌ సందేశం పంపమని కోరాడు.

పుష్ప సినిమాలో యాక్ష‌న్ డైలాగులు పాట‌లు ప్ర‌తిదీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేవ్ క్రియేట్ చేసాయి. హిందీ స్టార్లు .. క్రికెట‌ర్లు .. అథ్లెట్లు అనుక‌రించేంత‌గా పాపుల‌ర‌య్యాయి. ముఖ్యంగా త‌గ్గేదేలే! అంటూ బ‌న్నీ మాస్ ఆహార్యం యూత్ కి పిచ్చిగా ఎక్కింది. ఇక శ్రీ‌వ‌ల్లీ సాంగ్ లో అత‌డి సిగ్నేచ‌ర్ స్టెప్ కి ఫిదా అవ్వ‌ని వారు లేరు. క్రికెట‌ర్లు సైతం చెప్పును జార‌విడుస్తూ స్టెప్పు క‌లిపారంటే అర్థం చేసుకోవాలి.

ఇక పుష్ప స్క్రిప్టుపై తొలి నుంచి బ‌న్నీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మూవీ విజ‌యంపై ధీమాను వ్య‌క్తం చేసారు. ఈ మూవీ విడుదలైన తర్వాత ప్రతి స్టార్ డైరెక్టర్ మెచ్చుకుంటార‌ని కూడా అత‌డు చెప్పాడు. మెప్పు పొంద‌క‌పోతే బహిరంగంగా చొక్కా విప్పేస్తానని అల్లు అర్జున్ ఆ వీడియోలో చెప్పారు. నిజానికి సుక్కూ స్క్రీన్ ప్లే పుష్ప‌కి ప్ర‌ధాన బ‌లంగా ప‌ని చేసింది. బ‌న్ని న‌ట‌న డైలాగులు పాట‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా నిలిచాయి. అడ‌వి ప‌చ్చ‌ద‌నం నేప‌థ్యం కూడా ప్ర‌ధాన అస్సెట్ గా నిలిచింది. పుష్ప ఘ‌న‌విజ‌యం వెన‌క టీమ్ వ‌ర్క్ ఎంతో కీల‌క‌మైన‌ది. ఇప్పుడు పుష్ప‌-2తో అంత‌కుమించి నిరూపించాల‌ని టీమ్ క‌సిగా ప‌ని చేయ‌నుంద‌ని తెలిసింది. మ‌రో ప‌దిహేను రోజుల్లోనే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.