Begin typing your search above and press return to search.

ఖైదీ కోసం ఇంకో పాటుందటగా..

By:  Tupaki Desk   |   27 Nov 2016 3:58 AM GMT
ఖైదీ కోసం ఇంకో పాటుందటగా..
X
'ఖైదీ నెం 150' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయిందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మొన్ననే స్లొవేనియా అండ్ క్రొయేషియాలో పాటల చిత్రీకరణ జరిగింది. కేవలం కోర్టు సీన్లు తీసేస్తే ఇక షూటింగ్ ఖతమ్ అనుకుంటున్న టైములో ఇప్పుడు మరొక న్యూస్ వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాకు సంబంధించిన ఇంకో పాట పెండింగ్ ఉందట. ఇప్పటికే చిరంజీవిపై ఎయిర్ పోర్టులో ఒక సోలో సాంగ్.. ఇక లక్ష్మీ రాయ్ తో ఒక ఐటెం నెంబర్.. అలాగే చిరు అండ్ కాజల్ పై ఫారిన్లో రెండు పాటలను షూట్ చేశారు. ఇకపోతే ఇప్పుడు 5వ సాంగ్ కూడా ఒకటి ప్లాన్ చేశారట. అన్నపూర్ణ స్టూడియోస్ 7 యాకర్స్ లో ఒక సెట్ వేసి.. అందులో మళ్ళీ చిరు అండ్ కాజల్ పై ఈ పాటను తీయనున్నారు. ఈ పాటలో కాజల్ అందాలను ఓ రేంజులో దారబోస్తుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి తనకున్న డ్యాన్సింగ్ కింగ్ అనే ఇమేజ్ కు తగ్గట్లుగానే ఈ ఐదు పాటల్లోనూ మెగాస్టార్ తన గ్రేస్ స్టెప్పుల తాలూకు టచ్ ను అభిమానులకు భారీ రేంజులో చూపించనున్నారని తెలుస్తోంది. 2017 సంక్రాంతికి ఆ స్టెప్పులు కిక్కును మనం ఆస్వాదించవచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/