Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ ఇంకో స్పీడ్ బ్రేకర్

By:  Tupaki Desk   |   21 Jun 2019 10:24 AM IST
ఆర్ ఆర్ ఆర్ ఇంకో స్పీడ్ బ్రేకర్
X
ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ ఆర్ ఆర్ ఆర్ కు వరస బ్రేకులు తప్పడం లేదు. ఓసారి రామ్ చరణ్ గాయపడితే నెలన్నర బ్రేక్. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చేతికి దెబ్బ. ఇంకొన్ని రోజులు విరామం. సరే అయిందేదో అయ్యింది ఇకపై అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటే అలియా భట్ రూపంలో కొత్త షాక్ తగిలింది. ప్రస్తుతం వారణాసిలో బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటున్న అలియా భట్ కు పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకింది.

పర్లేదు తనవల్ల ఇబ్బంది కలగకూడదు అని అలాగే పాల్గొన్న అలియాకు అక్కడున్న వేడికి తాళలేక సమస్య ఎక్కువ కావడంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం న్యూ యార్క్ వెళ్లిపోయింది. దీంతో బ్రహ్మాస్త్ర టీం వెనక్కు వచ్చేసింది. ఇందులో నాగార్జున ఓ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఆర్ ఆర్ ఆర్ టీంకు శరాఘాతంలా తగిలింది. అతి త్వరలో అహ్మదాబాద్ షెడ్యూల్ ప్లాన్ చేసిన రాజమౌళికి అలియా భట్ మెసేజ్ పంపించిందట. ఒకవేళ త్వరగానే తిరిగి వచ్చినా ముందుగా బ్రహ్మాస్త్రలోనే పాల్గొనాలి. ఆ తర్వాతే ఆర్ ఆర్ ఆర్ కు జాయిన్ అవ్వొచ్చు.

కాని ఇదంతా ఒక కొలిక్కి రావడం డాక్టర్ల సలహా మేరకు ఉంటుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు జోడిని సెట్ చేసేందుకు తెగ వెతుకుతున్న రాజమౌళికి ఆల్రెడీ రామ్ చరణ్ కు ఫిక్స్ అయిన అలియా భట్ కు ఇలా కావడం షాక్ ఇచ్చేదే. ఈ లెక్కన చూస్తుంటే వచ్చే ఏడాది జూలై 30న ఆర్ ఆర్ ఆర్ వస్తుందా రాదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోసారి రాజమౌళి ప్రెస్ మీట్ లాంటిది పెట్టి వీటికి క్లారిటీ ఇస్తే బెటర్