Begin typing your search above and press return to search.

మరో కంచెరపాలెం ఆన్ ది వే

By:  Tupaki Desk   |   21 Jun 2019 1:28 PM IST
మరో కంచెరపాలెం ఆన్ ది వే
X
టాలీవుడ్ లో గతంలో చూడని ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిన కేరాఫ్ కంచెరపాలెంకు ప్రేక్షకుల నుంచే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సైతం మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంశలు అందుకోవడం దీనికే చెల్లింది. సహజమైన వాతావరణంలో నటనే అలవాటు లేని కొత్త ఆర్టిస్టులతో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయత్నానికి నిర్మాత ప్రవీణ పరుచూరి సంకల్పం తోడై మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకుంది.

సురేష్ లాంటి పెద్ద బ్యానర్ అండదండలు అందుకున్న చిత్రంగా మరో క్రెడిట్ కూడా దక్కించుకుంది. ఇప్పుడీ టీమ్ మరోసారి టై అప్ అవుతోంది. నిర్మాత దర్శకుడు మళ్ళీ రిపీట్ అవుతున్నారు. ఈసారి ఎలాంటి కథను ఎంచుకుంటారా అనే ఆసక్తి రేగడం సహజం. నిన్న క్యాస్టింగ్ కాల్ కు పిలుపు ఇచ్చారు. తెలుగు బాగా మాట్లాడగలిగే ముగ్గురు అమ్మాయిల కోసం వేట మొదలుపెట్టారు. పరబాషా హీరోయిన్లను తీసుకోకుండా ఇలా మొగ్గు చూపడం మంచి ప్రయత్నమే.

చూస్తుంటే ఈసారి కూడా కంచెరపాలెం తరహాలో న్యాచురల్ కాన్సెప్ట్ ఏదో ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. క్యాస్టింగ్ ఫైనల్ అయ్యాక పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఇందులో కొత్త వాళ్ళతో పాటు కొందరు సీనియర్ హాస్యనటులను కూడా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతా ఓకే అయ్యాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది