Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడితో కంగ‌న గొడ‌వ.. నిజం ఇదీ..

By:  Tupaki Desk   |   7 Jun 2019 9:23 AM GMT
ద‌ర్శ‌కుడితో కంగ‌న గొడ‌వ.. నిజం ఇదీ..
X
ర‌చ‌యిత‌లు - ద‌ర్శ‌కుల ప‌నిత‌నం న‌చ్చ‌క‌పోతే నిర్మొహ‌మాటంగా మెడ‌ప‌ట్టి గెంటేసి తిరిగి వాళ్ల స్థానంలో తానే ఛార్జ్ తీసుకుంటూ కంగ‌న ఆడుతున్న ఆట తెలిసిందే. రైటింగ్ న‌చ్చ‌లేదంటూ రైట‌ర్ల‌తో.. ద‌ర్శ‌క‌త్వం న‌చ్చ‌లేదంటూ ద‌ర్శ‌కుల‌తోనూ లొల్లు పెట్టుకుంటూ కంగ‌న చుక్క‌లు చూపిస్తోంది. న‌చ్చ‌ని వ్య‌వ‌హారాల్లో నిర్మొహ‌మాటంగా ఉంటూ ఇండ‌స్ట్రీ బ్యాడ్ గాళ్ గా పాపుల‌రైంది.

`మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` విష‌యంలో ఇదే త‌ర‌హాలో క్రిష్ తో కంగ‌న వివాదం సంచ‌ల‌న‌మైంది. ఆ క్ర‌మంలోనే క్రిష్ ఆ ప్రజెక్టును మ‌ధ్య‌లోనే వ‌దిలేసి హైద‌రాబాద్ కి వ‌చ్చేస్తే కంగ‌న టేకోవ‌ర్ చేసింది. పెండింగ్ 10శాతానికి త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఒక భోజ్ పురి సినిమాలా తీశాడు క్రిష్!! అంటూ తీవ్రంగానే విమ‌ర్శించిన కంగ‌న .. టోట‌ల్ స‌క్సెస్ క్రెడిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. అందుకే మ‌రోసారి మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడికి అలాంటి స‌న్నివేశ‌మే ఎదురు కాబోతోందా? అంటే అవున‌నే ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న `మెంట‌ల్ హై క్యా` చిత్రానికి తెలుగు ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డి ప‌నిత‌నం క్వీన్ కి అస్స‌లు న‌చ్చ‌లేద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ పాత్ర‌ను హైలైట్ చేస్తూ తన పాత్రను త‌గ్గించ‌డంపై కంగ‌న అసంతృప్తితో ఉంద‌ట‌. అస‌లే మేల్ డామినేష‌న్ న‌చ్చ‌ని క్వీన్ ఈసారి ఏం చేయ‌బోతోంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక తాజా రూమ‌ర్ల‌పై ప్ర‌కాష్ కోవెల‌మూడి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేద‌ని.. షూటింగ్ స్మూత్ గా సాగుతోంద‌ని తెలిపారు. కంగ‌న‌- రాజ్ కుమార్ రావ్ ఇద్ద‌రితో క‌లిసి ప‌ని చేయ‌డం గొప్ప అనుభ‌వాన్నిచ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. అత‌డు చెప్పిన దానిని బ‌ట్టి.. క‌నీసం ఈ ఒక్క ద‌ర్శ‌కుడు అయినా కంగ‌న‌కు బాస‌ట‌గా నిల‌వ‌డాన్ని హ్యాపీగానే ఫీల‌వ్వాలి. ఆ మంచి మాట కోస‌మైనా కంగ‌న అత‌డిని బ‌య‌ట‌కు గెంటేయ‌ద‌నే భావిద్దాం. `మెంట‌ల్ హై క్యా` ఈనెల 26న రిలీజ‌వుతోంది. ప్ర‌కాష్ కోవెల‌మూడి భార్య క‌నిక థిల్లాన్ ఈ చిత్రానికి స్క్రిప్టును అందించారు.