Begin typing your search above and press return to search.

స్టార్ రైట‌ర్ మోక్ష‌జ్ఞ డెబ్యూ డైరెక్ట‌రా?

By:  Tupaki Desk   |   6 Jun 2020 4:45 AM GMT
స్టార్ రైట‌ర్ మోక్ష‌జ్ఞ డెబ్యూ డైరెక్ట‌రా?
X
ద‌శాబ్ధం క్రిత‌మే నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీపై ఆసక్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే అప్ప‌టికి మోక్షు స్ట‌డీస్ కొన‌సాగిస్తాడ‌ని బాల‌య్య ఆ పుకార్ల‌ను ఖండించారు. ఆ త‌ర్వాత 2017లో మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఉంటుంద‌ని బ‌ల‌మైన ప్ర‌చారం మొద‌లైంది. బాల‌య్య బాబు వ్య‌క్తిగ‌త టీమ్ నుంచి ఈ త‌ర‌హా ప్ర‌చారం స్ప్రెడ్ అయ్యింది. దాంతో ఇక మోక్షు ఎంట్రీకి ఎంతో స‌మ‌యం లేద‌ని అంతా భావించారు. కానీ 2020లో అడుగు పెట్టినా అత‌డి ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

నంద‌మూరి అభిమానుల్లో ఈ మూడేళ్ల‌లో నిరంత‌రం మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ గురించే చ‌ర్చ సాగింది. కానీ మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికీ అత‌డు హీరో అవుతాడా అవ్వ‌డా? అన్న సందేహాలు అలానే ఉన్నాయి. అస‌లు మోక్ష‌జ్ఞ‌కు సినీరంగం అంటే అంత ఆస‌క్తి లేద‌ని అత‌డు హీరో అవ్వ‌డ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. మోక్ష‌జ్ఞ ఎంత‌మాత్రం త‌న రూపంపై శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని ఫోటో ప్రూఫ్ ల‌ను బ‌య‌ట‌పెట్టారు.

అదంతా గ‌తం. వ‌ర్త‌మానంలో మోక్ష‌జ్ఞ సినీ ఆరంగేట్రానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న టాక్ మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ అవ‌స‌రం మేర రూపురేఖ‌ల్ని మార్చుకుంటూ న‌ట శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని త్వ‌ర‌లోనే ఎంట్రీ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ అత‌డిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్క‌నుంది? అంటే.. ప‌రిశ్ర‌మ‌లో స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ కి ఆ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ఆస్థాన ర‌చ‌యిత‌గా పాపుల‌రైన సాయి మాధ‌వ్ ఇటీవ‌ల ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు మాట‌లు అందించారు. మెగాస్టార్ న‌టించిన‌ పాన్ ఇండియా మూవీ `సైరా: న‌ర‌సింహారెడ్డి` రైటింగ్ టీమ్ లో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రానికి ర‌చ‌యిత‌గా కొన‌సాగుతున్నారు. దీంతో పాటే ప‌లు క్రేజీ చిత్రాల‌కు ప‌ని చేస్తున్నారు.