Begin typing your search above and press return to search.

'వన్' ట్రైలర్: పొలిటికల్ థ్రిల్లర్ తో వస్తున్న మెగాస్టార్..!

By:  Tupaki Desk   |   11 March 2021 10:19 PM IST
వన్ ట్రైలర్: పొలిటికల్ థ్రిల్లర్ తో వస్తున్న మెగాస్టార్..!
X
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ''వన్''. సంతోష్ విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ మరియు సంజయ్ కలిసి ఈ సినిమాకి స్టోరీ అందించారు. ఇందులో కేరళ ముఖ్యమంత్రిగా మమ్ముట్టి కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో 'వన్' సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ చూస్తుంటే ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన కడక్కల్ చంద్రన్ అనే వ్యక్తి ప్రజా నాయకుడిగా నెంబర్ వన్ గా ఎలా ఎదిగాడానేదే 'వన్' కథ అని తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.. సీఎం అయిన తర్వాత అతనికి ఎదురైన రాజకీయ సవాళ్ళు.. ప్రతిపక్షాల కుట్రలను తట్టుకుని తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించడానేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 'నేను కేవలం ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. కేరళలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రినే' అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్ అలరోస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా మమ్ముట్టి లుక్ మరియు ఆయన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి.

'వన్' చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వైడీ సోమ సుందరమ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ గోపి - జగదీష్ - అలెన్సియర్ లే లోపేజ్ - సుధీర్ కరమణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.