Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే రోజున.. ‘వ‌కీల్ సాబ్’ రొమాన్స్‌..?

By:  Tupaki Desk   |   7 Feb 2021 8:45 AM GMT
వాలెంటైన్స్ డే రోజున.. ‘వ‌కీల్ సాబ్’ రొమాన్స్‌..?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్రేక్ష‌కులు తెర‌పై చూసి మూడు సంవ‌త్స‌రాలు దాటింది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఒక‌టీ రెండు కాదు, వెంట వెంట‌నే నాలుగు సినిమాల‌ను ప్ర‌క‌టించాడు. అందులో ముందుగా బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్న మూవీ ‘వకీల్ సాబ్’.

హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి ఇది రీమేక్. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ స్వరాలు సమూరుస్తున్నారు.

ఈ మధ్యనే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం.. సమ్మర్ లో బరిలోకి దిగబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 9 న ఈ సినిమానున రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే.. ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లాస్ట్ నైట్ ట్విటర్ లో ఓ పోస్టు చేశారు. ఒక లవ్ సింబల్ షేర్ చేసిన ఆయన “ఫిబ్రవరి 14” అని రాసుకొచ్చారు. దీంతో.. దీని అర్థమేంటనే చర్చ మొదలైంది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ నుంచి రాబోతున్న మరో పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

పవన్, శ్రుతిహాసన్ మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ ను ఆ రోజు రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని థమన్ ఆ విధంగా రివీల్ చేశారని అంటున్నారు. మరి, ఆ ట్వీట్ మీనింగ్ అదేనా? కాదా? అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ‘మగువా.. మగువా’ సాంగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.