Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. ప‌వ‌న్ ఆశీస్సులు తీసుకున్న స‌మంత‌..!

By:  Tupaki Desk   |   28 April 2021 1:30 PM GMT
బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. ప‌వ‌న్ ఆశీస్సులు తీసుకున్న స‌మంత‌..!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇవాళ 35వ ప‌డిలోకి ప్ర‌వేశించింది. క‌రోనా నేప‌థ్యంలో ఆడంబ‌రంగా పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ ఏమీ లేవుకానీ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌ల వెల్లువ కొన‌సాగుతోంది. ఫ్యాన్స్ తోపాటు ప‌లువురు సెల‌బ్రిటీస్ సామ్ కు గ్రీటింగ్స్ చెబుతున్నారు. అయితే.. పుట్టిన రోజు వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మంత‌ను ఆశీర్వ‌దించారంటూ ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ - స‌మంత కాంబినేష‌న్లో ‘అత్తారింటికి దారేది’ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2013లో రిలీజ్ అయ్యింది. స‌మంత కెరీర్లో టాప్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచిందీ మూవీ. ఈ సినిమాలో ప‌వ‌న్ - స‌మంత కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది.

అయితే.. ఆన్ లొకేష‌న్లో క్యాప్చ‌ర్ చేసిన ఫొటో ఒక‌టి.. ఇప్పుడు తెగ స‌ర్క్యులేట్ అవుతోంది. ఈ ఫొటోలో ప‌వ‌న్ స్వామీజీ టైపులో చిద్విలాసం చిందిస్తూ ఆశీర్వ‌దిస్తుండ‌గా.. కింద కూర్చున్న స‌మంత భ‌క్తురాలి త‌ర‌హాలో న‌మ‌స్క‌రిస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్ కాసేపు ఫ‌న్నీ బాబాగా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో తీసిని ఫొటో కావొచ్చ‌ని అనుకుంటున్నారు.

ఇవాళ.. సామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫ‌న్నీ క్యాప్ష‌న్లు రాస్తున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా స‌మంత‌ను ఆశీర్వ‌దిస్తున్న ప‌వ‌న్ అంటూ న‌వ్వులు పూయిస్తున్నారు.