Begin typing your search above and press return to search.

త్వరలో మాస్టర్ ఇళయదలపతి రానున్నాడా..?

By:  Tupaki Desk   |   10 April 2020 10:10 AM GMT
త్వరలో మాస్టర్ ఇళయదలపతి రానున్నాడా..?
X
తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'మాస్టర్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉందట. ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మాస్టర్ లో విజయ్ సరసన మాళవిక మోహన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఏదో విషయం పై విజయ్ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక 'మాస్టర్'ను లాక్ డౌన్ ఏమీ చేయలేదు .. త్వరలో 'మాస్టర్'ను మీరు చూస్తారు అనే అర్థం వచ్చేలా పోస్టర్ పై రాసి ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

కరోనా కారణంగా విడుదలకు సిద్దమైన సినిమాలు అన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ నెలలో మాస్టర్ సినిమా విడుదల కావాల్సింది. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ బట్టి త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేస్తారేమో అని భావిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గ్యాంగ్ స్టర్ - కాలేజ్ ప్రొఫెసర్ వంటి రెండు విభిన్నమైన లుక్స్ తో విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఇళయదళపతితో పోరాడే ప్రతినాయకుడి పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించనుండటం విశేషం. రెండు పవర్ ఫుల్ పర్సనాలిటీలు పోట్లాడితే థియేటర్ల లో చూడాలనే అభిమానుల కోరికను ఈ కరోనా నెరవేరనిస్తుందో లేక ఏం చేస్తుందో అని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.